IPL2022 RR Vs MI : హాఫ్ సెంచరీతో రాణించిన బట్లర్.. ముంబై టార్గెట్ ఎంతంటే

రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్‌ (67) మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఆఖర్లో అశ్విన్‌ 21 పరుగులు చేశాడు.

IPL2022 RR Vs MI : హాఫ్ సెంచరీతో రాణించిన బట్లర్.. ముంబై టార్గెట్ ఎంతంటే

Ipl2022 Rr Vs Mi

IPL2022 RR Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సంజూసేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై ముందు 159 పరుగుల మోస్తరు టార్గెట్ నిర్దేశించింది.

రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్‌ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్‌ (21) వేగంగా పరుగులు రాబట్టాడు. బట్లర్‌ (67) మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఆఖర్లో అశ్విన్‌(21) ఫర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్‌, మెరెడిత్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కుమార్ కార్తికేయ, డేనియల్‌ సామ్స్‌ తలో వికెట్‌ తీశారు.(IPL2022 RR Vs MI)

Virat Kohli First Fifty : ఎట్టకేలకు.. విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ

రాజస్తాన్ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఈ సీజన్ లో మరో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే చాలా నెమ్మదిగా (48 బంతుల్లో) అర్థ శతకం సాధించడం విశేషం. ప్రస్తుత సీజన్‌లో బట్లర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.

ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. కాగా.. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో రాజస్తాన్‌ ఆరింటిలో నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఈ సీజన్‌లో ముంబై ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకుండా అట్టడుగు స్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఇవాళ్టి మ్యాచ్ లో ముంబై ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. వరుసగా ఎనిమిది మ్యాచులను ఓడిన జట్టుగా రికార్డు సృష్టించిన ముంబై ఈసారైనా తొలి గెలుపు రుచి చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. కీలక సమయాల్లో బ్యాటర్లు చేతులెత్తేడయంతో గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా ముంబై చేజార్చుకుంటోంది. మరి ముంబై బోణీ కొడుతుందో లేదో చూడాలి. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి పవర్‌ప్లే అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని రాజస్తాన్‌ భావిస్తోంది.(IPL2022 RR Vs MI)

Virat Kohli: వివ్ రిచర్డ్స్‌ను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ

జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్ : ఇషాన్‌ కిషన్‌, రోహిత్ శర్మ (కెప్టెన్‌), టిమ్‌ డేవిడ్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ, కీరన్‌ పొలార్డ్, హృతిక్ షోకీన్‌, డానియల్ సామ్స్, బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్.

రాజస్తాన్‌ రాయల్స్ : జోస్ బట్లర్, దేవదుత్ పడిక్కల్, సంజూ శాంసన్‌ (కెప్టెన్), డారిల్ మిచెల్, షిమ్రోన్ హెట్‌ మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ సేన్.