ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన ఇషాన్, హుడా.. పాక్ కెప్టెన్‌ను అధిగమించిన స్టీవ్ స్మిత్‌

బౌలింగ్ విభాగంలో టాప్ -10 లో ఒక్కరూ టీమిండియా నుంచి లేకపోవడం గమనార్హం. హార్ధిక్ పాండ్య పది స్థానాలను మెరుగుపర్చుకొని 76వ ర్యాంకు అందుకున్నాడు. అగ్రస్థానంలో శ్రీలంక బౌలర్ హసరంగ నిలిచాడు. భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్ మాత్రమే 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన ఇషాన్, హుడా.. పాక్ కెప్టెన్‌ను అధిగమించిన స్టీవ్ స్మిత్‌

ICC Rankings

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ క్రీడాకారులు దీపక్ హుడా, ఇషాన్ కిషన్ మెరిశారు. ఒకేఒక్క ఇన్నింగ్స్‌తో భారత క్రికెటర్ దీపక్ హుడా ఏకంగా 40 స్థానాలు ఎగబాకి ఐసీసీ టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ -100 జాబితాలో చోటు దక్కింకున్న హుడా ప్రస్తుతం 337 పాయింట్లతో 97వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్ర స్థానంలో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్

మరోవైపు యువ క్రీడాకారుడు ఇషాన్ కిషన్ కూడా పది స్థానాలను మెరుగుపర్చుకొని 23వ ర్యాంకుకు చేరాడు. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్ధిక్ పాండ్య 50వ ర్యాంక్ చేరుకున్నాడు. గతంలోలాగే టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 883 రేటింగ్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీటితోపాటు టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అధిగమించాడు. పాక్ కెప్టెన్ ఒక స్థానం దిగజారి మూడో ర్యాంకుకు పరిమితమయ్యాడు. స్మిత్ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. మొదటి ర్యాంకులో ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లాబుషెన్ కొనసాగుతున్నాడు.

 

ఐసీసీ బౌలింగ్ విభాగంలో టాప్ -10 జాబితాలో ఒక్కరూ టీమిండియా నుంచి లేకపోవడం గమనార్హం. హార్ధిక్ పాండ్య పది స్థానాలను మెరుగుపర్చుకొని 76వ ర్యాంకు అందుకున్నాడు. అగ్రస్థానంలో శ్రీలంక బౌలర్ హసరంగ నిలిచాడు. భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్ మాత్రమే 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.