India vs Bangladesh 3rd ODI: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఇంతకుముందు ఎవరెవరు చేశారంటే?

ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు 9 సిక్స్ లతో (200)  డబుల్ సెంచరీ సాధించాడు.

India vs Bangladesh 3rd ODI: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఇంతకుముందు ఎవరెవరు చేశారంటే?

Team india

India vs Bangladesh 3rd ODI:భారత్ బ్యాటర్లు విజృంభిస్తున్నారు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. విరాట్ – ఇషాన్ జోడీ వరుస బౌండరీలతో టీమిండియా భారీ స్కోర్ దిశగా పరుగుపెడుతోంది. భారత్ – బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో భాగంగా చివరి వన్డే ఇవాళ ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ధావన్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ధావన్ తక్కువ స్కోర్ కే అవుట్ కావటంతో క్రిజ్ లోకి కోహ్లీ వచ్చాడు. కోహ్లీ – ఇషాన్ జోడి వీరవిహారం చేస్తుంది. వరుస బౌండరీలతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.

India vs Bangladesh: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. భారత తుది జట్టు ఇదే

ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడాడు. కేవలం 85 బంతుల్లో సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్.. మరో 40 బంతుల్లో మరో శతకం కొట్టి డబుల్ సెంచరీ చేశాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు 9 సిక్స్ లతో (200)  డబుల్ సెంచరీ సాధించాడు. అనంతరం 131 బంతుల్లో వ్యక్తిగత స్కోరు 210 (10 సిక్స్ లు, 24ఫోర్లు) వద్ద అవుట్ అయ్యాడు. వన్డేల్లో ఇషాన్ కిషన్‌కు ఇది తొలి డబుల్ సెంచరీ. భారత్ తరపున ద్విశతకం కొట్టిన నాలుగో బ్యాటర్ ఇషాన్ కిషన్ కావటం విశేషం.

India vs Bangladesh Test Series: బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు ఆ ముగ్గురు ప్లేయర్స్ దూరమైనట్లేనా? అసలు విషయం ఏమిటంటే?

అంతర్జాతీయంగా ఇప్పటి వరకు తొమ్మిది డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో భారత్ నుంచే నలుగురు బ్యాటర్లు ఆరు ద్విశతకాలు కొట్టారు. టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ ఏకంగా మూడుసార్లు (264, 209, 208*) డబుల్‌ సెంచరీలు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ (219), సచిన్ తెందూల్కర్ (200*) కూడా ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా ఇషాన్ కిషన్ వీరి జాబితాలో (210) చేరాడు.