Umran Malik : పళ్లు, కూరగాయాలు అమ్ముకుంటా..ఉమ్రాన్‌ చూసి గర్వ పడుతున్నా

తమది పేద కుటుంబం, పళ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నా...తన కొడుకు ఐపీఎల్ లో ఆడడం నిజంగా తమకెంతో గొప్ప విషయమన్నారు పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తండ్రి అబ్దుల్‌ మాలిక్.

Umran Malik : పళ్లు, కూరగాయాలు అమ్ముకుంటా..ఉమ్రాన్‌ చూసి గర్వ పడుతున్నా

Malik

Umran Malik Father : తమది పేద కుటుంబం, పళ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నా…అలాంటిది తన కొడుకు ఐపీఎల్ లో ఆడడం నిజంగా తమకెంతో గొప్ప విషయమన్నారు పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తండ్రి అబ్దుల్‌ మాలిక్‌. తన కొడుకు ఏదో ఒకరోజు టీమిండియా తరపున ఆడుతాడని తెలిపారు. మూడేళ్ల వయస్సు నుంచే క్రికెట్ పై అతను మక్కువ పెంచుకున్నాడని, ఇప్పుడు ఐపీఎల్ లో ఆడడం తనకు సంతోషంగా ఉందన్నారు. టీవీలో అతని ఆట చూసుకుంటూ..మురిసిపోతున్నామన్నారు. ఐపీఎల్ 2021 మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read More : Yuvaraj Biopic : క్రికెటర్ యువరాజ్ బయోపిక్.. కొత్త హీరోతో ప్రయోగం..

ఇతను సన్ రైజర్స్ జట్టుకు ఆడుతున్నాడు. బౌలర్ నటరాజన్ కు కరోనా సోకడంతో..ఉమ్రాన్ మాలిక్ కు జట్టులో చోటు దక్కింది. ఆడేందుకు వచ్చిన చక్కటి అవకాశాన్ని ఉమ్రాన్ సద్వినియోగం చేసుకుంటున్నాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే అత్యంత వేగంగా బంతిని (సుమారు 153 కి.మీ) విసిరిన ఉమ్రాన్ మాలిక్…బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ కెరీర్ లో తన తొలి వికెట్ నమోదు చేశారు. ఈ క్రమంలో…ఉమ్రాన్ తండ్రి స్పందించారు. ఓ జాతీయ పత్రికతో ఆయన మాట్లాడారు. ఉమ్రాన్ ప్రదర్శన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Read More : IPL 2021 SRH Vs RCB వాటే మ్యాచ్.. బెంగళూరుపై హైదరాబాద్ గెలుపు
సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో తన కొడుక్కి చోటు దక్కడం అమితానందం ఇచ్చిందని, మ్యాచ్ జరుగుతున్న సమయంలో తాము టీవీలకు అతుక్కపోయామన్నారు. తెరపై ఉమ్రాన్ ను చూసి నా భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయన్నారు. తమది చాలా పేద కుటుంబం అని, ఉమ్రాన్ మమ్మల్ని గర్వపడేలా చేశాడని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమకు అభినందనలు తెలియచేశారని ఉమ్రాన్ తండ్రి అబ్దుల్ మాలిక్ వెల్లడించారు.