Ravindra Jadeja: గాయం పేరుతో బంగ్లా టూర్ డుమ్మా కొట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జడేజా.. తీవ్ర స్థాయిలో విమర్శలు

జడేజాకు బంగ్లా టూర్ నడుస్తోంది. అయితే తన కాలికి గాయమైందని బంగ్లా టూర్ డుమ్మా కొట్టారు జడేజా. కట్ చేస్తే భార్యతో ఎన్నికల ప్రచారంలో కనిపించారు. దీంతో జడేజా తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భార్య కోసం ఎన్నికల ప్రచారం చేయడం తప్పు కాదు కానీ, ఇలా టూర్ డొమ్మా కొట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Ravindra Jadeja: గాయం పేరుతో బంగ్లా టూర్ డుమ్మా కొట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జడేజా.. తీవ్ర స్థాయిలో విమర్శలు

Jadeja Campaigns For Wife, Cricket Fans Troll

Ravindra Jadeja: టీం ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కారణం గాయం పేరు చెప్పి బంగ్లా టూర్ డుమ్మా కొట్టిన ఆయన.. భార్య గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గాయంతో బాధపడుతున్న ఆటగాడు ఇలా చేయడం ఏంటని క్రికెట్ అభిమానులే కాకుండా ఇతరులు తీవ్రంగా మండిపడుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జాంనగర్ ఉత్తరం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున ఆమె ఎన్నికల బరిలో ఉన్నారు.

కాగా, ఇప్పటికే ఆమె ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ఉన్నారు. మరో పక్క జడేజాకు బంగ్లా టూర్ నడుస్తోంది. అయితే తన కాలికి గాయమైందని బంగ్లా టూర్ డుమ్మా కొట్టారు జడేజా. కట్ చేస్తే భార్యతో ఎన్నికల ప్రచారంలో కనిపించారు. దీంతో జడేజా తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భార్య కోసం ఎన్నికల ప్రచారం చేయడం తప్పు కాదు కానీ, ఇలా టూర్ డొమ్మా కొట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తన భార్య కోసం దేశానికి ప్రాతినిధ్యాన్ని వదిలేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇక దీనికి తోడు.. ప్రచారంలో భాగంగా జడేజా ఇండియన్ జెర్సీలో ఉన్న కరపత్రాలను బీజేపీ పంచడం మరింత వివాదాస్పదమవుతోంది. బీజేపీ కారణంగానే ఆయన బంగ్లా టూర్‭కు దూరమయ్యారనే విమర్శలు సైతం వస్తున్నాయి. రవీంద్ర జడేజాపై చర్యలు తీసుకోవాలని క్రీడాభిమానులు, ఇతరులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దేశం కోసం ఆడాల్సి వచ్చినప్పుడు ఇలా దొంగసాకులు చెప్పి తప్పించుకోవడం ఏంటని మండిపడుతున్నారు.

DK Shivakumar: ఒక కుటుంబానికి ఒకే టికెట్.. కట్టుదిట్టంగా అమలు చేస్తామంటున్న కాంగ్రెస్