Olympic 2021 : టోక్యో ఒలింపిక్స్, భారత క్రీడాకారులపై ఆంక్షలు

ఒలింపిక్స్ కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. భారత అథ్లెట్లు, కోచ్ లు, సిబ్బందిపై జపాన్ ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. టోక్యోకు వచ్చే ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Olympic 2021 : టోక్యో ఒలింపిక్స్, భారత క్రీడాకారులపై ఆంక్షలు

Olympic India

Olympic Tokyo : ఒలింపిక్స్ కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. టోక్యో లో జరిగే ఈ క్రీడలు అసలు జరుగుతాయా ? లేదా అనే సందిగ్ధత నెలకొంది. గత సంవత్సరం జరగాల్సిన విశ్వ క్రీడలు ఈ ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం….జూలై 23వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. కరోనా కారణంగా..క్రీడలు జరుగుతాయా ? లేదా ? అనేది తెలియరావడం లేదు.

అయితే..ఒలింపిక్స్ కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. భారత అథ్లెట్లు, కోచ్ లు, సిబ్బందిపై జపాన్ ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. టోక్యోకు వచ్చే ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వారం పాటు ప్రతి రోజు టెస్టు చేసుకోవాలని జపాన్ సూచించింది. టోక్యో చేరిన తర్వాత..మూడు రోజుల పాటు ఎవరినీ కలవొద్దని ఆంక్షలు విధించింది. జపాన్ విధించిన ఈ ఆంక్షలను భారత ఒలింపిక్ సంఘం తప్పు బట్టింది. భారత్ స్పందనపై జపాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ ప్రపంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. వైరస్ పోయిందని అనుకున్న క్రమంలో..ఈ దిక్కుమాలిన వైరస్ మరోసారి రెచ్చిపోతోంది. సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా కారణంగా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు రద్దయ్యాయి. క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. క్రికెట్ తో పాటు ఇతర క్రీడలు తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే. అలాగే..ఒలింపిక్స్ క్రీడల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని అతిథ్య నగర ప్రజలు కోరుతున్నా, ప్రభుత్వం మాత్రం విశ్వక్రీడలను ఎలాగైనా నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. వైరస్‌ ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉండటంతో ఒలింపిక్స్‌ వంటి మెగా టోర్నీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.