Jasprit Bumrah: టీ20 ప్రపంచ కప్‌కు దూరం.. స్పందించిన బుమ్రా

వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచక‌ప్‌కు బుమ్రా దూరం కానున్నాడని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. దీనిపై బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

Jasprit Bumrah: టీ20 ప్రపంచ కప్‌కు దూరం.. స్పందించిన బుమ్రా

Jasprit Bumrah: గాయం కారణంగా ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా బుమ్రా టోర్నీకి దూరం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో బుమ్రా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

Type-C Cable: చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లు.. ఇకపై అన్ని గాడ్జెట్లకు ఒకటే కేబుల్.. చట్టం చేసిన యురోపియన్ యూనియన్

ఈ అంశంపై బుమ్రా స్పందించాడు. ‘‘నేను ఈ సారి టీ20 ప్రపంచక‌ప్‌కు దూరమయ్యానని తెలిసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోలేదు. నేను తొందరగా కోలుకోవాలని కోరుతూ, నాపై ప్రేమ చూపిస్తున్న స్నేహితులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. ఇక ఆస్ట్రేలియాలో జరగబోతున్న ప్రపంచ కప్‌లో టీమిండియాను బయటి నుంచి ఉత్సాహపరుస్తా’’ అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వెన్ను నొప్పి కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 టోర్నీ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. తాజాగా వైద్యుల బృందం బుమ్రాను పరిశీలించింది.

ఆయన కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా బుమ్రా రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడం లేదని బీసీసీఐ వెల్లడించింది. 2016లో టీ20ల్లోకి అడుగుపెట్టిన బుమ్రా ఇప్పటివరకు 57 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 67 వికెట్లు పడగొట్టాడు.