జో రూట్.. నీకు మగాళ్లంటే ఇష్టమా: శిక్షతో ముగిసిన వివాదం

జో రూట్.. నీకు మగాళ్లంటే ఇష్టమా: శిక్షతో ముగిసిన వివాదం

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్‌ను ‘గే’గా సంభోధించడం పట్ల క్షమాపణలతో బయటపడ్డాడు విండీస్ బౌలర్. సెయింట్ లూసియా వేదికగా జరిగిన మూడో టెస్టులో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న జో రూట్ ఏకాగ్రత దెబ్బతీయాలని భావించాడు విండీస్ ఫేసర్ గాబ్రియల్. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన మ్యాచ్‌లో అతనిని కించపరచగా ”గే’ గా ఉండటం వల్ల తప్పేంటి?’ అని జో రూట్ సమాధానం ఇవ్వడం మాత్రం మైక్‌లో రికార్డు అయ్యింది. విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఐసీసీ విచారణ చేపట్టింది. 

ఐసీసీ ప్రవర్తన నియమావళి ప్రకారం.. అతనిపై శిక్ష విధిస్తూ 4 వన్డేల నిషేధం, మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోతతోపాటు 3 డీమెరిట్‌ పాయింట్లు కూడా చేర్చింది. అప్పటికీ గాబ్రియెల్ ఏం వ్యాఖ్యలు చేశాడానని అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. వాటన్నిటికీ సమాధానమిచ్చేందుకు గాబ్రియెల్ మీడియాతో మాట్లాడాడు. ‘మ్యాచ్‌లో జోరూట్ నిలకడగా ఆడుతుండటంతో అతడి ఏకాగ్రతను దెబ్బతీయాలనుకున్నాను. అందుకే బంతి విసిరిన తర్వాత అతనికి దగ్గరగా వెళ్లి.. నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? నీకు బాయ్స్ అంటే ఇష్టమా?’ అని అడిగినట్లు తెలిపాడు.

మ్యాచ్‌ అనంతరం గాబ్రియల్‌ తప్పుచేసినట్టు అంగీకరించడంతో లెవల్‌-2 కింద అతడిపై చర్యలు తీసుకున్నారు. గతంలో చేసిన తప్పుల కారణంగా గాబ్రియల్ ఖాతాలో ఇప్పటికే 5 డీమెరిట్‌ పాయింట్లు ఉన్నాయి. తాజాగా 3 పాయింట్లతో కలిపి అతడి సంఖ్య 8కి పెరిగింది. నిబంధనల ప్రకారం 24 నెలల్లో ఓ ఆటగాడు 8 డీ మెరిట్ పాయింట్లు పొందితే.. అతడు 2 టెస్టులు లేదా 4 వన్డేలు లేదా 4 టీ20ల నిషేదానికి గురవుతాడు. 

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

Also Read : మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం

Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే

Also Read :  ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది

Also Read : తెలుగులో కూడా పేటీఎం సేవలు

Also Read : ZOMATO CHAT: అమ్మతోడు సార్.. మీ డబ్బులు వచ్చేస్తాయ్