WTC final: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌.. వైరల్ ఫోటోపై విలియమ్సన్ ఫస్ట్ రియాక్షన్..!

విరాట్ కోహ్లీ vs విలియమ్సన్- ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(WTC 2021)ను న్యూజిలాండ్‌ జట్టు కైవసం చేసుకోగా.. ఈ సంధర్భంగా కివీస్ జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌ కోహ్లీని ఆలింగనం చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

WTC final: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌.. వైరల్ ఫోటోపై విలియమ్సన్ ఫస్ట్ రియాక్షన్..!

Will

WTC final, Kane Williamson: విరాట్ కోహ్లీ vs విలియమ్సన్- ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(WTC 2021)ను న్యూజిలాండ్‌ జట్టు కైవసం చేసుకోగా.. ఈ సంధర్భంగా కివీస్ జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌ కోహ్లీని ఆలింగనం చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్రికెట్ చరిత్రలో వీరిద్దరి క్రేజ్ కారణంగా విపరీతంగా వైరల్ అయ్యిన ఫోటో గురించి లేటెస్ట్‌గా విలియమ్సన్‌ స్పందించారు.

కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ, భారతదేశానికి వ్యతిరేకంగా మేం ఆడుతున్నప్పుడు, ఎక్కడ ఉన్నా కూడా కష్టమైన సవాలే అవుతుంది. టీమిండియాకు వ్యతిరేకంగా మ్యాచ్ గెలవడం అంటే చాలా గొప్ప విషయం. టీమ్ ఇండియా ఆటగాళ్ళు క్రికెట్‌లో ఎప్పుడూ కూడా ఒక బెంచ్ మార్కును నిర్దేశిస్తారు. వారి జట్టులో వారి దేశంలో క్రికెట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారనే విషయం కనిపిస్తుంది. వారిపై గెలవడంతో నేను భావోద్వేగానికి లోనయ్యాను. అని చెప్పారు విలియమ్సన్.

విరాట్ కోహ్లీ భుజంపై ఎందుకు తల పెట్టుకున్నాను అనే విషయానికి వచ్చినప్పుడు, కేన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, నేను ఒకరినొకరు చాలాకాలంగా ఎదుర్కొంటూనే ఉన్నాము.. మేం ఇద్దరం మంచి స్నేహితులం.. చాలాకాలంగా కలిసి ఆడుతున్నాము. మా స్నేహం క్రికెట్ ఆటలో మాత్రమే కాదు.. అంతకుమించి. అందుకే ఆ సమయంలో నా స్నేహితుడైన కోహ్లీ భుజంపై తలపెట్టాను అంటూ చెప్పుకొచ్చారు.

వాస్తవానికి విరాట్ కోహ్లీ, విలియమ్సన్ మధ్య పోటీ ఎప్పటి నుంచో ఉంది. భారత్-కివీస్ మధ్య అండర్-19 మ్యాచ్ 2008 ఫిబ్రవరిలో జరిగింది. ఆ మ్యాచ్‌లో కూడా భారత జట్టుకు కోహ్లి, న్యూజీలాండ్ జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించగా.. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సారధ్యంలోని భారత్ జట్టు నెగ్గింది. అప్పటినుంచి కూడా కోహ్లీ, విలియమ్సన్ మధ్య స్నేహం ఉంది.