పంత్‌కు కపిల్ సూచన..విమర్శలకు సమాధానం చెప్పాలి

  • Published By: madhu ,Published On : January 26, 2020 / 02:54 PM IST
పంత్‌కు కపిల్ సూచన..విమర్శలకు సమాధానం చెప్పాలి

టీమిండియా యువ క్రికేటర్ రిషబ్ పంత్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పలు సూచనలు చేశారు. అద్భుత ప్రదర్శన చేసి విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పాలన్నారు. రిషబ్ పంత్‌కు ఎంతో ప్రతిభ ఉందని వ్యాఖ్యానించారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే..ప్రస్తుతం రిషబ్ పంత్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

పదే పదే ఔట్ అవుతూ..జట్టులో చోటు కోల్పోతున్నాడు. గత మూడు మ్యాచ్‌ల నుంచి పంత్‌ను తుది జట్టును తప్పించి కేఎల్ రాహుల్‌కు చోటు కల్పిస్తున్నారు. గత వారంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ మధ్యలో వికెట్ కీపర్ ప్లేస్‌కు  దూరమయ్యాడు పంత్. దీనిపై కపిల్ స్పందించారు. పంత్‌ను తప్పించడం, రాహుల్‌తో వికెట్ కీపింగ్ చేయించడం..జట్టు యాజమాన్యం ఆలోచనగా తెలిపారు.

ఎవరు ఓపెనర్‌గా రావాలి ? ఎవరు మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగాలి..కీపింగ్ ఎవరు చేయాలి ? అనేది యాజమాన్యం నిర్ణయిస్తుందన్నారు. అయితే..ప్రస్తుతం గాయాల విషయంలో దృష్టి కేంద్రీకరించాలని, బౌలర్ల గురించి ఆలోచించాలన్నారు. పాండ్యా రీ ఎంట్రీపై ఆందోళన చెందుతున్నాడని, తొందరగా కొలుకుని జట్టులోకి రావాలని అనుకుంటున్నాడని వెల్లడించారు.

అయితే..గాయాల నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదు..ఫిట్ నెస్‌పై అతడు దృష్టి పెట్టాలన్నారు. భారతదేశంలో వాతావరణం, పరిస్థితులు ఎప్పుడూ సవాల్‌గా ఉంటాయని చెప్పిన కపిల్…ఏడాదికి పది నెలలు క్రికేట్ ఆడితే..ఆటగాళ్లకు గాయలు అవుతుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

రిషబ్ పంత్ విషయంలో రవిశాస్త్రి ఇటీవలే కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. జట్టులోకి పునరాగమనం చేయాలంటే..తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మరి కపిల్ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి. 

Read More : రద్దీ నియంత్రించేందుకు : పెట్రోల్ బంకుల్లో FASTag