SL vs IRE 1st Test: ప‌సికూన‌ల‌పై క‌రుణ‌ర‌త్నే, కుశాల్ భారీ శ‌త‌కాలు

గాలె వేదిక‌గా శ్రీలంక, ఐర్లాండ్ జట్లు మొద‌టి టెస్టులో త‌ల‌ప‌డుతున్నాయి. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి లంక జ‌ట్టు నాలుగు వికెట్ల న‌ష్టానికి 386 ప‌రుగులు చేసింది. దినేశ్ చండీమాల్ 18, ప్రబాత్ జయసూర్య 12 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

SL vs IRE 1st Test: ప‌సికూన‌ల‌పై క‌రుణ‌ర‌త్నే, కుశాల్ భారీ శ‌త‌కాలు

SL vs IRE(photo-icc twitter)

SL vs IRE 1st Test: ఐర్లాండ్ జ‌ట్టు శ్రీలంక‌లో ప‌ర్య‌టిస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా లంక జ‌ట్టుతో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఇందులో భాగంగా ఆదివారం ఇరు జ‌ట్ల మ‌ధ్య గాలె వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్ ఆరంభ‌మైంది. టాస్ గెలిచిన శ్రీలంక జ‌ట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి లంక జ‌ట్టు నాలుగు వికెట్ల న‌ష్టానికి 386 ప‌రుగులు చేసింది. దినేశ్ చండీమాల్ 18, ప్రబాత్ జయసూర్య 12 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

ప‌సికూన‌లపై లంక బ్యాట‌ర్లు విరుచుకుప‌డ్డారు. తొలి వికెట్‌కు 64 ప‌రుగులు జోడించిన త‌రువాత నిశాన్‌ మ‌దుష్క పెవిలియ‌న్ చేరుకున్నాడు. ఇక అక్క‌డి నుంచి మొద‌లైంది అస‌లు ఆట ఓపెన‌ర్‌, కెప్టెన్ దిముత్ క‌రుణ‌ర‌త్నే(179) కు కుశాల్ మెండీస్‌(140) జ‌త క‌లిశాడు. వీరిద్ద‌రు ఐర్లాండ్ బౌల‌ర్ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా భారీ షాట్ల‌తో విరుచుకుప‌డ్డారు. ప్ర‌త్య‌ర్థి అనుభ‌వ‌లేమీ కూడా వీరికి క‌లిసి వ‌చ్చింది. దీన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ఇద్ద‌రూ శ‌త‌కాలు న‌మోదు చేశారు.

IPL 2023, MI vs KKR:వెంక‌టేశ్ అయ్య‌ర్ శ‌త‌కం వృథా.. కోల్‌క‌తా పై ముంబై గెలుపు

టెస్టుల్లో క‌రుణ‌ర‌త్నేకు ఇది 15వ శ‌త‌కం కాగా మెండీస్‌కు 8వ ది. వీరిద్ద‌రి జోడిని డాక్రెల్ విడ‌దీశాడు. మెండీస్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో 281 ప‌రుగుల రెండో వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఈ ద‌శ‌లో ఐర్లాండ్ బౌల‌ర్లు విజృంభించారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఏంజెలో మాథ్యూస్‌(0)తో పాటు క‌రుణ‌ర‌త్నేను ఔట్ చేసి కాస్త ఉప‌శ‌మ‌నం పొందారు. దినేశ్ చండీమాల్ , ప్రబాత్ జయసూర్యలు మ‌రో వికెట్ ప‌డ‌కుండా రోజును ముగించారు.

ఇక ఈ మ్యాచ్‌లో శ‌త‌కం చేయ‌డం ద్వారా కరుణ‌ర‌త్నే మ‌రో ఘ‌న‌త‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక దిగ్గ‌జ ఆట‌గాడు స‌నత్ జ‌య‌సూర్య‌, ఆల్‌రౌండ‌ర్ ఏంజెలో మాథ్యూస్ లు త‌మ టెస్టు కెరీర్‌లో 14 శ‌త‌కాలు సాధించ‌గా వీరిద్ద‌రిని క‌రుణ‌రత్నె దాటాడు. లంక త‌రుపున అత్య‌ధిక శ‌త‌కాలు చేసిన ఆరో బ్యాట‌ర్‌గా నిలిచాడు. శ్రీలంక త‌రుపున అత్య‌ధిక శ‌త‌కాలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో కుమార సంగ‌క్క‌ర‌(38) తొలి స్థానంలో ఉండ‌గా మ‌హేలా జ‌య‌వ‌ర్ధ‌నే(34) రెండో స్థానంలో ఉన్నారు.

Venkatesh Iyer: 15 ఏళ్ల నిరీక్షణకు తెర‌దించిన‌ వెంక‌టేశ్ అయ్య‌ర్‌.. మెక్‌క‌ల్ల‌మ్ త‌రువాత‌