Kent vs Somerset : అవుటా ? సిక్సా…ఏమంటారు

బ్యాట్స్ మెన్ కొట్టిన...బంతిని బౌండరీ దగ్గర పట్టుకున్నాడు ఫీల్డర్. అయితే...బౌండరీలోపునే పట్టుకున్నా..థర్డ్ అంపైర్ సిక్స్ అని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపోయారు.

Kent vs Somerset : అవుటా ? సిక్సా…ఏమంటారు

Match

Kent vs Somerset Final Match : క్రికెట్….ఇందులో చాలా వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. బ్యాట్స్ మెన్ అవుట్ అయినా..అంపైర్ ఇవ్వకపోవడం, అవుట్ కాకపోయినా..అవుట్ అని అంపైర్ చేతి పైకి ఎత్తడం జరుగుతుంటాయి. బ్యాట్స్ మెన్ కొట్టిన బంతిని పట్టుకొనేందుకు ఫీల్డర్లు సాహసమే చేస్తుంటారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి.

Read More : Amarinder Singh..సిద్ధూ దేశానికే డేంజర్..కాంగ్రెస్ కి 10 సీట్లు కూడా కష్టమే!

తాజాగా..బ్యాట్స్ మెన్ కొట్టిన…బంతిని బౌండరీ దగ్గర పట్టుకున్నాడు ఫీల్డర్. అయితే…బౌండరీలోపునే పట్టుకున్నా..థర్డ్ అంపైర్ సిక్స్ అని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో…అవుట్ అయ్యానని అనుకున్న అతను…నిరాశ చెందాడు. కానీ అంపైర్ నిర్ణయంతో మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ ఘటన కెంట్, సోమర్సెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది.

Read More : Rhino horns: రైనో కొమ్ముల‌ను కాల్చేసిన అస్సాం ప్రభుత్వం.. ఎందుకంటే?

వైటాలిస్టు బ్లాస్ట్ టీ 20 ఫైనల్ మ్యాచ్ జరిగింది. సోమర్సెట్ – కెంట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో సోమర్సెట్ బ్యాట్స్ మెన్ విల్ స్మీడ్ లో క్రీజులో ఉన్నారు. ఓ భారీ షాట్ కొట్టాడు. దానిని బౌండరీ దగ్గర జోర్డాన్ కాక్స్ అందుకొనేందుకు ప్రయత్నించాడు. కాక్స్ అందుకుంటున్న సమయంలో…అటువైపు నుంచి మరో ఫీల్డర్ డేనియల్ బెల్ కూడా అందుకోవడానికి వచ్చాడు. వీరిద్దరూ ఆకాశంలో ఉన్న బంతి వైపు చూస్తూ పరుగెత్తారు. కాక్స్ క్యాచ్ అందుకున్నాడు. డైవ్ చేసే సమయంలో డేనియల్ బెల్ నియంత్రణ కోల్పోయి…బౌండరీ లైన్ కు తాకాడు.

Read More : CM Jagan : ఇళ్ల పట్టాల పంపిణీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

కాక్స్ కూడా బెల్ నుంచి తప్పించుకొనే క్రమంలో…అతడిని తాకాడు. అంపైర్ థర్డ్ అంపైర్ ను ఆశ్రయించారు. రీ ప్లేలు చూసిన థర్డ్ అంపైర్ చివరికి దీనిని సిక్స్ గా ప్రకటించారు. ఎందుకంటే ఫీల్డర్ నేరుగా బౌండరీ లైన్ ను తాకలేదు. కానీ..ఆ లైన్ ను తాకిన మరో ఫీల్డర్ ను టచ్ చేశాడు కాబట్టే..సిక్స్ గా ప్రకటించారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అది సిక్స్ ఎలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ..క్రికెట్ రూల్ ప్రకారం అది సిక్స్ అని మరికొందరు అంటున్నారు.