ఖవాజా మరో సారి సెంచరీ, దూకుడుగా ఆసీస్

ఖవాజా మరో సారి సెంచరీ, దూకుడుగా ఆసీస్

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆడుతోన్న ఆఖరి వన్డేలోనూ ఆస్ట్రేలియా దూకుడుగా కనిపిస్తోంది. ఆరంభం నుంచి అదే పోటీ కనిపిస్తోన్న జట్టులో ఓపెనర్లు ఇరగదీస్తున్నారు. 14.3 ఓవర్లకు 76 పరుగుల వద్ద తొలి వికెట్‌గా ఆరోన్ ఫించ్(27; 43 బంతుల్లో 4 ఫోర్లు)ను కోల్పోగా, రెండో వికెట్‌గా ఉస్మాన్ ఖవాజా(100)ను 32.6 ఓవర్లకు 175 పరుగుల వద్ద కోల్పోయింది. 
Read Also : కట్టడి చేసిన భారత్.. ఆస్ట్రేలియా స్కోరు 272

ఖవాజా మరో సారి సెంచరీ:
కెరీర్ ఆరంభం నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని ఉస్మాన్ ఖవాజా భారత్ పర్యటనలోనే తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో 107బంతులు ఆడి సెంచరీ చేసిన ఖవాజా… ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతోన్న 4వ వన్డేలోనూ 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ చేసి అద్భుతహ అనిపించాడు. 

సెంచరీ పూర్తి చేసిన వెంటనే అదే ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో క్యాచ్ ఇవ్వడంతో వికెట్‌ను కోల్పోయాడు. ఖవాజా స్థానంలో దిగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్(1)సైతం స్వల్ప విరామంతోనే వెనుదిరగడంతో ఆసీస్ 34 ఓవర్లకు 178 పరుగులకు 3 వికట్లు నష్టపోయింది. క్రీజులో పీటర్ హ్యాండ్స్‌కాంబ్(49), మార్కస్ స్టోనిస్(0)తో ఉన్నారు. 
Read Also : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గురించి తెలుసుకోవలసినవి