KKR vs KXIP: కోల్‌కతాపై పంజాబ్ విజయం.. ప్లే ఆఫ్ రేసులోకి బలంగా!

  • Published By: vamsi ,Published On : October 27, 2020 / 06:47 AM IST
KKR vs KXIP: కోల్‌కతాపై పంజాబ్ విజయం.. ప్లే ఆఫ్ రేసులోకి బలంగా!

IPL 2020 KKR vs KXIP: ఐపిఎల్ 2020లో 46వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), కింగ్స్ ఎలెవన్ పంజాబ్(KXIP) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన KKR జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓటమితో ఐదవ స్థానానికి పడిపోయింది.



మన్‌దీప్ సింగ్ 8 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 56 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేయగా.. క్రిస్ గేల్ 29 బంతుల్లో 51 పరుగులు చేశాడు. గేల్ రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ 25 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 4 ఫోర్లు కొట్టాడు. వరుణ్ చక్రవర్తి, లాకీ ఫెర్గూసన్ చెరొక వికెట్ సాధించారు.



https://10tv.in/punjab-vs-delhi-38th-match-live-cricket-score-commentary/
ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. పవర్ ప్లే కాకముందే మూడు వికెట్లు కోల్పోయింది. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో రాణా డకౌట్‌ అవగా.. తర్వాత ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి(7), దినేశ్‌ కార్తీక్‌(0)లు పెవిలియన్ చేరారు. మహ్మద్‌ షమీ వేసిన రెండో ఓవర్‌ నాల్గో బంతికి త్రిపాఠి ఔట్‌ కాగా, ఆఖరి బంతికి కార్తీక్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో కేకేఆర్‌ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.



అటువంటి సమయంలో గిల్‌కు జత కలిసిన ఇయాన్‌ మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 81 పరుగుల భాగస్వామ్యం అందించడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ కుదుట పడింది. మోర్గాన్‌ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. తర్వాత నరైన్‌(6),నాగర్‌కోటి(6), కమిన్స్‌(1)లు తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. ఇక గిల్‌ 45 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లతో 57 పరుగులు చేయగా.. లాస్ట్‌లో లాకీ ఫెర్గూసన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌ బాది నాటౌట్‌గా నిలిచాడు. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్‌, క్రిస్‌ జోర్డాన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. మురుగన్‌ అశ్విన్‌, మ్యాక్స్‌వెల్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.



కోల్‌కతాపై విజయంతో సిరీస్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఐదవ విజయం. ఈ విజయం తరువాత, జట్టు ఇప్పుడు 12 పాయింట్లతో ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలను బలోపేతం చేసుకుంది. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో, జట్టు నాలుగో స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్ రేసు నుంచి ఫస్ట్‌లోనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్న పంజాబ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి నాలుగో స్థానానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయ పరంపరను ప్రారంభించిన పంజాబ్ జట్టు కోల్‌కతాతో మ్యాచ్ వరకు వరుసగా 5 విజయాలు కైవసం చేసుకుంది. ముంబై ఇండియన్స్‌ను కూడా పంజాబ్ జట్టు డబుల్ సూపర్ ఓవర్‌లో ఓడించిన సంగతి తెలిసిందే. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది.



ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ముంబైకి 7 విజయాలతో 14 పాయింట్లు ఉండగా, ఢిల్లీకి కూడా అదే సంఖ్యలో పాయింట్లు ఉన్నాయి మరియు రెండవ స్థానంలో ఉన్నాయి. మూడవ స్థానంలో ఉన్న బెంగళూరుకు కూడా 14 పాయింట్లు ఉన్నాయి. వరుస విజయాల తరువాత, ఇప్పుడు పంజాబ్ నాల్గవ స్థానానికి చేరుకుంది. కోల్‌కతా జట్టు 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లతో రాజస్థాన్ ఆరో స్థానంలో ఉంది. హైదరాబాద్, చెన్నైలకు చెరో ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. రెండు జట్లు వరుసగా ఏడవ మరియు ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి.