KKRvsMI: ముంబైపై మెరుపులు కురిపించిన కోల్‌కతా

కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ముంబైపై విజృంభించారు. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌కు 233పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసుకు అర్హత దక్కుతుందనే తపనతో కోల్‌కతా కనిపించింది.

కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ముంబైపై విజృంభించారు. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌కు 233పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసుకు అర్హత దక్కుతుందనే తపనతో కోల్‌కతా కనిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ ఓపెనర్లు నుంచి బౌండరీల వర్షం కురిపించారు. అదుపు చేసేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ముంబై బౌలర్లకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో 9.3 ఓవర్లకు తొలి వికెట్ చిక్కింది. 

శుభ్‌మాన్ గిల్(76; 45బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సులు)తో రెచ్చిపోతున్న వేళ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో లూయీస్ క్యాచ్ అందుకోవడంతో 9.3 ఓవర్ల వద్ద తొలి వికెట్ దొరికింది. మరో ఓపెనర్ క్రిస్ లిన్(54; 29 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సులు)తో 15.2ఓవర్లకు రాహుల్ చాహర్ బౌలింగ్‌లో లూయీస్‌కు క్యాచ్ ఇవ్వడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆండ్రీ రస్సెల్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 40 బంతుల్లో 6ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 80 పరుగులు చేశాడు. చివర్లో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తీక్(15; 7 బంతుల్లో)చేయడంతో 2వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసింది.