T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌లో కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా..? రోహిత్‌శర్మ ఏమన్నాడంటే..

ఆసియాకప్ టీమిండియా  చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆటతీరుతో మేము సంతోషంగా ఉన్నాము. కానీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో పాటు టీ20 వరల్డ్ కప్‌లో   కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ తెలిపాడు.

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌లో కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా..? రోహిత్‌శర్మ ఏమన్నాడంటే..

Rohit Sharma

T20 World Cup: ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకిదిగి కేవలం 61 బంతుల్లో అజేయంగా 122 పరుగులతో రికార్డు సృష్టించిన విషయం విధితమే. అయితే గత మ్యాచ్‌లలో కేఏ రాహుల్, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగుతూ వచ్చారు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెన్లుగా బరిలోకి దిగుతారని చర్చ కొనసాగుతుంది. ఇదేవిషయాన్ని ఆదివారం విలేకరులు రోహిత్ శర్మను ప్రశ్నించారు. రోహిత్ మాత్రం.. టీ20 వరల్డ్‌‌కప్‌లో కేఎల్ రాహుల్ తనతో కలిసి ఓపెనింగ్ చేస్తాడని క్లారిటీ ఇచ్చాడు. ఈ నెల, వచ్చేనెల మొదటి వారంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో స్వదేశంలో భారత్ జట్టు టీ20 సిరీస్ లను ఆడనుంది. ఈ మ్యాచ్ లలోనూ ఓపెనర్ గా రాహుల్ బరిలోకి దిగుతాడని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

Brett Lee Praises Kohli: కోహ్లీకి ఆ సెంచరీ చేయడానికి అందుకే మూడేళ్లు పట్టింది..! విరాట్‌ గురించి బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు ..

ఆస్ట్రేలియాతో సెప్టెంబరు 20న మొహాలీలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలిమ్యాచ్ జరగనుంది. సెకండ్ మ్యాచ్ 23న నాగ్‌పూర్‌లో, 25న హైదరాబాద్‌లో మూడో మ్యాచ్ జరుగుతుంది. తొలి టీ20కి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పలు అంశాలపై విలేకరులతో ఆదివారం మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ ఓపెనింగ్ బ్యాటింగ్ ప్రారంభించడం గురించి రోహిత్ మాట్లాడుతూ.. ఆసియాకప్ టీమిండియా  చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆటతీరుతో మేము సంతోషంగా ఉన్నాము. కానీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో పాటు టీ20 వరల్డ్ కప్‌లో   కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని తెలిపాడు. అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఆటతీరును చూస్తే.. అతను ఎలాంటి పరిస్థితిలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని రుజువు చేసిందని అన్నారు.

Virender Sehwag criticises Kohli and co: కోహ్లీతో పాటు ఇతర భారత క్రికెటర్లపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు

ఉమేష్ ఎంపిక గురించి రోహిత్ మాట్లాడుతూ.. బౌలర్ మొహమ్మద్ షమీ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ కు షమీ దూరమయ్యాడు. షమీ స్థానంలో మరో ఫేస్ బౌలర్ ఉమేష్ ను తీసుకున్నామని రోహిత్ అన్నాడు. అతను చాలా బాగా బౌలింగ్ చేస్తాడు, బంతిని స్వింగ్ చేయడంతోపాటు వేగంగా బౌలింగ్ చేస్తాడు. ఉమేష్ ను ఎంపిక చేయడంలో పెద్దగా చర్చేమీ జరగలేదు. అయితే.. ప్రపంచ కప్ గురించి మేం ఆలోచిస్తున్నాం అని రోహిత్ అన్నాడు.