చిన్ననాటి కష్టాలే మా వ్యూహాలకు బలం: కోహ్లీ

నేను కలలు కనడంలో ముందుంటాను. అందరూ వ్యతిరేకిస్తున్నా జట్టును గెలిపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటా. ఛెత్రికి కూడా జట్టును ఏ సందర్భంలో ఎలా నడిపించాలో బాగా తెలుసు. స్టేడియంలో ఎవరూ నమ్మకపోయినా ఛెత్రి అనుకున్నదే చేస్తాడు.

10TV Telugu News

నేను కలలు కనడంలో ముందుంటాను. అందరూ వ్యతిరేకిస్తున్నా జట్టును గెలిపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటా. ఛెత్రికి కూడా జట్టును ఏ సందర్భంలో ఎలా నడిపించాలో బాగా తెలుసు. స్టేడియంలో ఎవరూ నమ్మకపోయినా ఛెత్రి అనుకున్నదే చేస్తాడు.

అంతర్జాతీయ స్థాయిలో దశదిశలా భారత ఖ్యాతిని చాటి చెప్తోన్న జాతీయ జట్టు కెప్టెన్లు విరాట్ కోహ్లీ, సునీల్ ఛెత్రి. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై హాజరుకానున్నారట. స్పోర్ట్స్ జర్నలిస్టు జతిన్ సప్రూ వ్యాఖ్యాతగా వ్యవహరించిన హాట్ స్టార్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి క్రీడా  ప్రయాణం ఎలా జరిగిందో అనే విషయాలపై చర్చించారట. ఈ కార్యక్రమంలో సునీల్ ఛెత్రి ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టాడు. స్పోర్ట్స్ హానర్స్ కార్యక్రమంలో కోహ్లీనే ప్రత్యకంగా నృత్యం చేసి అలరించనున్నాడని తెలిపాడు. 

‘ఈ కార్యక్రమాన్ని వీక్షించడం మర్చిపోకండి. ఎందుకంటే విరాట్ కోహ్లీ తన అద్భుతమైన డ్యాన్స్ షోతో మీ ముందుకు రానున్నాడు. నేను కచ్చితంగా చెప్పగలను. మరే బాలీవుడ్ హీరో చేయలేనంత గొప్పగా చేస్తాడని మాటిస్తున్నా’ అని వెల్లడించాడు ఛెత్రి. వెంటనే వ్యాఖ్యాతను ప్రశ్నిస్తూ.. ‘నువ్వెప్పుడైనా కోహ్లీ డ్యాన్స్ చూశావా. ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ కార్యక్రమంలో చూద్దువుగానీ’ అంటూ వివరించాడు. 

ఈ కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లీ..’నేను కలలు కనడంలో ముందుంటాను. అందరూ వ్యతిరేకిస్తున్నా జట్టును గెలిపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటా. ఛెత్రికి కూడా జట్టును ఏ సందర్భంలో ఎలా నడిపించాలో బాగా తెలుసు. స్టేడియంలో ఎవరూ నమ్మకపోయినా ఛెత్రి అనుకున్నదే చేస్తాడు. ఆ తర్వాత స్టేడియంలో వారంతా ఆశ్చర్యపోతూ సంబరాలు చేసుకుంటారు. ఇదంతా ఛెత్రి ప్రణాళికలో నుంచి వచ్చిందే. అది మ్యాచ్‌లో చాలా చాలా ముఖ్యం’ అని వ్యాఖ్యానించాడు. 

ఈ మాటలకు అంగీకారం తెలిపిన ఛెత్రి ..’నేనెప్పుడూ ఒక హీరోగా ఫీలవుతూనే నిర్ణయాలు తీసుకుంటాను. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని అనుకుంటున్న సమయంలో వ్యూహాలు రచిస్తాను. అదే మైదానంలో అమలుపరుస్తాను’ అని చెప్పుకొచ్చాడు. 

వీరిద్దరూ మైదానంలో వ్యూహాలు రచించడం, ఒత్తిడి ఎదుర్కోవడం వంటి అంశాలపై మాట్లాడుతూ.. ‘మాకు 8,9 సంవత్సరాల వయస్సున్పప్పుడు ఇంకా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాం. ఇప్పుడు అదే మా వ్యూహాలకు పదునుపెట్టే సామర్థ్యాన్ని ఇస్తుంది. బాల్యంలో నేర్చుకున్నదే ఇక్కడ ఉపయోగపడుతుంది. ఫిబ్రవరి 16న ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ కార్యక్రమానికి స్కిప్పర్ ఛెత్రి, ఛాంప్ కోహ్లీలు కలిసి హాజరుకానున్నారు. 

×