సిక్సుల్లో రికార్డు కొట్టేసిన ధోనీ.. కోహ్లీలు

సిక్సుల్లో రికార్డు కొట్టేసిన ధోనీ.. కోహ్లీలు

టీమిండియా మాజీ కెప్టెన్, కెప్టెన్‌లు రెండో టీ20లో రెచ్చిపోయారు. సిరీస్‌ను చేజార్చుకోకూడదనే ఊపులో దూకుడుగా ఆడారు. ఈ మేర విరాట్ కోహ్లీ(72; 38 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులు)తో అజేయంగా నిలిచాడు. కోహ్లీకి చక్కటి భాగస్వామ్యం అందించిన ధోనీ(40; 23 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్సులు)తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌తో ధోనీ, కోహ్లీ పేరిట రెండు రికార్డులు నమోదైయ్యాయి.

కోహ్లీ, ధోనీ ఈ మ్యాచ్‌తో సిక్సుల్లో హాఫ్ సెంచరీలు సాధించేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసే విరాట్ తొలి టీ20లో 24 పరుగులతోనే సరిపెట్టుకోవడంతో అభిమానులంతా నిరుత్సాహానికి గురైయ్యారు. ఈ మ్యాచ్‌లో 6 సిక్సులు బాదిన కోహ్లీ 62 ఇన్నింగ్స్‌లో 54 సిక్సులు బాదిన రికార్డును కొట్టేశాడు. ఈ మ్యాచ్‌తో కలిపి 85 ఇన్నింగ్స్‌లు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ రెండో టీ20లో 3 సిక్సులు కలిపి 52 సిక్సులకు చేరుకున్నాడు. 

సిక్సులు బాదిన టీమిండియా క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ 102 సిక్సర్లతో టాప్‌లో ఉన్నాడు.  ఆ తర్వాత 72 సిక్సర్లతో యువరాజ్ సింగ్ కొనసాగుతుండగా, మూడో స్థానంలో సురేశ్ రైనా 56 సిక్సులతో, కోహ్లీ 54 సిక్సులతో, ధోనీ 52 సిక్సులతో నిలిచారు. 

ఈ జాబితాను పరిశీలిస్తే: 

  •  102 (86 ఇన్నింగ్స్): రోహిత్ శర్మ
  •  74 in (51 ఇన్నింగ్స్): యువరాజ్ సింగ్
  •  56 in (66 ఇన్నింగ్స్): సురేశ్ రైనా
  •  52 in (85 ఇన్నింగ్స్): ధోని
  •  54 in (62 ఇన్నింగ్స్): విరాట్ కోహ్లీ