India vs Australia: విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ మిస్.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 571 పరుగులు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. అయితే, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ 364 బంతుల్లో 186 బాది, ముర్ఫీ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.

India vs Australia: విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ మిస్.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 571 పరుగులు

India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. అయితే, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ 364 బంతుల్లో 186 పరుగులు బాది, ముర్ఫీ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఆలౌట్ అయింది.

ఇవాళ డబుల్ సెంచరీ చేస్తే… టెస్టుల్లో కోహ్లీకి ఇది రెండో డబుల్ సెంచరీ అయ్యేది. 2019, అక్టోబరు 10న, పుణెలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచులో కోహ్లీ 254 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇవాళ టెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

కోహ్లీతో పాటు ఇతర బ్యాటర్లూ రాణించడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేస్తోంది.  తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేసింది. ఇవాళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి  6 ఓవర్లలో 3 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ప్రస్తుతం 88 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

కాగా, ఇంతకు ముందు వీరేంద్ర సెహ్వాగ్, కేకే నాయర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ టీమిండియా నుంచి డబుల్ సెంచరీలు చేశారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు డబుల్ సెంచరీలు చేసిన బ్యాటర్ గా సెహ్వాగ్ మాత్రమే ఉన్నారు.

Virat Kohli: జూలు విదిల్చిన విరాట్ కోహ్లీ.. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. టెస్టులో 28వ సెంచరీ నమోదు..