IND vs AUS 1st ODI: అలా వదిలేస్తే ఎలా..! కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై కోహ్లీ అసహనం.. వీడియో వైరల్

మ్యాచ్ 18వ ఓవర్‌లో స్టోయినిస్ పదునైన బంతులతో హార్ధిక్ పాండ్యా పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఫ్రీ హిట్ బంతికి హార్ధిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగే రాబట్టగిలిగాడు.

IND vs AUS 1st ODI: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ వన్డేలో టీమిండియా విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలివన్డేలో అనేక అవాంతరాల మధ్య కే.ఎల్. రాహుల్ (75) అద్భుత ఆటతీరుతో టీమిండియా విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 188 పరుగులకే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేశారు. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు.. విజయం అంతతేలిగ్గా దక్కలేదు.

IND vs AUS 1st ODI: 5 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు.. కేఎల్ రాహుల్ 75 పరుగులు బాది నాటౌట్

తొలివన్డేలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరుతో కెప్టెన్‌గా హార్ధిక పాండ్యా బాధ్యతలు చేపట్టాడు. 189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (3) ఔట్ అయ్యాడు. ఆ వెంటనే విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్(0) ఔట్ అయ్యారు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకూరుకుపోయిన భారత్ జట్టును ఆదుకొనేందుకు రాహుల్, శుభ్‌మన్ గిల్ ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికే గిల్ (20) అవుట్ కావడంతో హార్ధిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. రాహుల్‌తో కలిసి నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు.

 

మ్యాచ్ 18వ ఓవర్‌లో స్టోయినిస్ పదునైన బంతులతో హార్ధిక్ పాండ్యా పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఫ్రీ హిట్ బంతికి హార్ధిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగే రాబట్టగిలిగాడు. దీంతో, కెప్టెన్ హార్ధిక్ బ్యాటింగ్ తీరుపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఆడితే ఎలా అన్నట్లుగా చేయిచూపుతూ కోహ్లీ పాండ్యాపై అసహనం వ్యక్తంచేస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే, స్టోయినిస్ వేసిన తరువాతి ఓవర్లో హార్ధిక్ పాండ్యా (25) అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన జడేజా(45)తో కలిసి రాహుల్ (75) భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ట్రెండింగ్ వార్తలు