India vs Srilanka: కోహ్లీ సెంచరీ.. గెలిస్తే క్లీన్ స్వీప్

అంతర్జాతీయ వన్డేల్లో గిల్ కు ఇది రెండో సెంచరీ. కోహ్లీ 10 ఫోర్లు 1 సిక్స్ తో వంద పరుగులు జేశాడు. అయితే అతను ఇప్పటి వరకు మొత్తం 74 సెంచరీలు చేయగా, వన్డేల్లో ఇది 46వ సెంచరీ. అయితే తొలుత ఓపెనర్లుగా రంగంలోకి దిగిన రోహిత్ శర్మ, శుబ్ మాన్ గిల్ లు తొలి వికెట్ కు 95 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. రోహిత్ వర్మ 42 పరుగులు చేసి వికెట్ ను సమర్పించుకున్నాడు

India vs Srilanka: కోహ్లీ సెంచరీ.. గెలిస్తే క్లీన్ స్వీప్

Kohli hits one more century, records 46th in odi cricket

India vs Srilanka: శ్రీలంక, ఇండియాల మధ్య జరుగుతున్న మూడవ వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఆదివారం తిరువనంతపురంలో జరుగుతున్న మూడో వన్డేలో ఇప్పటికే యువ బ్యాట్స్ మెన్ శుబ్ బాన్ గిల్ సెంచరీ నమోదు చేయగా.. మరో విక్టరీ నమోదు చేశాడు డ్యాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కేవలం 85 బాల్స్ లోనే కోహ్లీ ఈ సెంచరీ నమోదు చేశాడు. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాధించడంతో భారత్ కు శుభారంభం లభించింది. గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు 2 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో గిల్ కు ఇది రెండో సెంచరీ. కోహ్లీ 10 ఫోర్లు 1 సిక్స్ తో వంద పరుగులు జేశాడు. అయితే అతను ఇప్పటి వరకు మొత్తం 74 సెంచరీలు చేయగా, వన్డేల్లో ఇది 46వ సెంచరీ. అయితే తొలుత ఓపెనర్లుగా రంగంలోకి దిగిన రోహిత్ శర్మ, శుబ్ మాన్ గిల్ లు తొలి వికెట్ కు 95 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. రోహిత్ వర్మ 42 పరుగులు చేసి వికెట్ ను సమర్పించుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత బ్యాటర్లు.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ కౌవసం చేసుకున్న టీం ఇండియా చివరి వన్డేను తన ఖాతాలో వేసుకోని సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది.

Mayawati: వచ్చే ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్న మాయావతి