KKR Vs SRH: సెంచెరీ విన్.. హైదరాబాద్‌పై కోల్‌కత్తాదే మ్యాచ్

KKR Vs SRH: సెంచెరీ విన్.. హైదరాబాద్‌పై కోల్‌కత్తాదే మ్యాచ్

Kolkata Beat Sunrisers By 10 Runs 100th Win For Kkr

SRH vs KKR, IPL 2021: ఐపీఎల్ 2021లో చెన్నై వేదికగా మెుదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌పై 10పరుగుల విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ మూడవ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు తొలి 20ఓవర్లలో 187 పరుగులు చేయగా.. 188పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లకు 177పరుగులు మాత్రమే చెయ్యగలిగింది.

బెయిర్‌స్టో, మనీష్ పాండే అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ వార్నర్, సాహాతో సహా టాప్ ఆర్డర్ రాణించలేదు.. కాగా ఫస్ట్ మ్యాచ్‌నే గెలుపుతో మొదలెట్టగా.. కోల్‌కత్తాకు ఓవరాల్‌గా ఇది వందో విజయం.

అంతకుముందు టాస్ ఓడిపోయి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్‌కు రాగా.. పవర్‌ప్లేలో ఓపెనర్లు షుబ్మాన్ గిల్, నితీష్ రానా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ మొదటి 6 ఓవర్లలో 50 పరుగులు జోడించారు. రషీద్ ఖాన్ బంతికి 15 పరుగులు చేసిన తరువాత షుబ్మాన్ గిల్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. నితీశ్ రానా 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. రాహుల్ త్రిపాఠి(53) రాణించగా.. 187పరుగుల భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ ముందు ఉంచింది.

అయితే వరుస ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోగా.. చివర్లో స్కోరు చేయడంలో విఫలమయ్యారు కోల్‌కత్తా ఆటగాళ్లు. కేకేఆర్ 15 ఓవర్లలోనే 145 పరుగుల భారీ స్కోరు చేయగా.. తర్వాతి ఓవర్లోనే రాహుల్ త్రిపాఠిని సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ అవుట్ చేయడం.. తర్వాత ఆండ్రూ రస్సెల్(5), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(2) రెండంకెల స్కోరు కూడా చేయకుండా పెవిలియన్ చేరారు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. చివర్లో దినేశ్‌ కార్తీక్‌(22) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. హైదరాబాద్‌ బౌలర్లలో నబీ, రషీద్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. నటరాజన్‌, భువనేశ్వర్‌ చెరొక వికెట్ పడగొట్టారు. తర్వాత 188 పరుగుల లక్ష్యంతో సన్‌ రైజర్స్ బరిలోకి దిగింది.