IND vs ENG 1st ODI : ఇంగ్లండ్ ఢమాల్.. తొలి వన్డేలో భారత్ విజయం

తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధించింది. 50 ఓవర్ల ఫార్మాట్‌ లో భారత్ బోణీ కొట్టింది. తొలి పోరులో ఇంగ్లాండ్‌ను 66 పరుగుల తేడాతో ఓడించింది.

IND vs ENG 1st ODI : ఇంగ్లండ్ ఢమాల్.. తొలి వన్డేలో భారత్ విజయం

Ind Vs Eng

IND vs ENG 1st ODI : తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధించింది. 50 ఓవర్ల ఫార్మాట్‌ లో భారత్ బోణీ కొట్టింది. తొలి పోరులో ఇంగ్లాండ్‌ను 66 పరుగుల తేడాతో ఓడించింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను 42.1 ఓవర్లకు 251 పరుగులకే ఆలౌట్ చేసింది. జానీ బెయిర్‌ స్టో (94; 66 బంతుల్లో 6×4, 7×6), జేసన్‌ రాయ్‌ (46; 35 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్) విధ్వంసాలకు భారత బౌలర్లు కట్టిదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేశారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (98; 106 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్స్) సెంచరీ మిస్ అయింది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (56; 60 బంతుల్లో 6ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (62; 43 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్స్), కృనాల్‌ పాండ్య (58; 31 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది భారత్. ప్రత్యర్థి జట్టుకు 318 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోహ్లీసేన నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లండ్ చేతులేత్తేసింది. 251 పరుగులకే చాపచుట్టేసింది.

దాంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో ప్రసీధ్ 4 వికెట్లు, శార్దూల్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు, కృనల్ పాండ్యా ఒక వికెట్ తీసుకున్నాడు.