టీమిండియాలో వికెట్ కీపర్‌గా తెలుగు కుర్రాడు

టీమిండియాలో వికెట్ కీపర్‌గా తెలుగు కుర్రాడు

టీమిండియాలో ఆంధ్ర ప్లేయర్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ చోటు కొట్టేశాడు. ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కేఎస్ భరత్ అనే యువ క్రికెటర్‌ను స్టాండ్ బై వికెట్ కీపర్ గా జట్టు మేనేజ్‌మెంట్ తీసుకుంది. మొదటి వన్డేలోనూ గాయం కారణంగా పంత్ తప్పుకోవడంతో కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు వచ్చాయి. 

రిషబ్ పంత్ మూడో వన్డేకు అందుబాటులోకి వస్తాడని వైద్యులు చెప్పడంతో అతని స్థానంలో రాహుల్‌ను తీసుకుని.. స్టాండ్ బైగా భరత్‌ను తీసుకుంది జట్టు. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో హెల్మెట్ కు బంతి తగలడంతో కంకషన్ కింద పంత్ స్థానంలో రాహుల్ వచ్చాడు. 

టీమిండియా 44వ ఇన్నింగ్స్ లోపాట్ కమిన్స్ షాట్ డెలీవరీ కారణంగా పంత్ బ్యాట్ కు తాకి హెల్మెట్ లో బంతి ఇరుక్కుంది. ఐసీసీ నియమావళి ప్రకారం.. రిహాబిలైజేషన్ సెంటర్‌కు వెళ్లాల్సిన పంత్.. రెండో గేమ్ కు మాత్రమే తప్పుకుని మూడో వన్డే నాటికి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. బెంగళూరులో ఆదివారం(జనవరి 19)న జరిగే మూడో వన్డే నాటికి భారత జట్టుతో కలవనున్నాడు.