IPL 2020, KXIP VS MI: పిచ్ రిపోర్ట్, వాతావరణం, మ్యాచ్ ప్రిడిక్షన్

  • Published By: vamsi ,Published On : October 1, 2020 / 04:09 PM IST
IPL 2020, KXIP VS MI: పిచ్ రిపోర్ట్, వాతావరణం, మ్యాచ్ ప్రిడిక్షన్

IPL 2020, KXIP VS MI: ముంబై ఇండియన్స్, కింగ్స్ XI పంజాబ్ జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌లో పోరాటానికి సిద్ధం అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిపోగా.. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ను ఓడించి తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో మ్యాచ్‌లో చిన్న తప్పిదాలు కారణంగా మ్యాచ్ కోల్పోయింది. పొలార్డ్, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడినా కూడా చివరికి సూపర్ ఓవర్‌లో ఓటమిని చవిచూసింది.

కింగ్స్ ఎలెవన్ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే.. రాజస్థాన్ రాయల్స్‌పై మంచి బ్యాటింగ్ ఉన్నప్పటికీ ఓడిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 224 లక్ష్యాన్ని ఇచ్చి కూడా దానిని కాపాడుకోలేకపోయింది. ఇది జట్టుకు తీవ్ర ఎదురుదెబ్బ. షెల్డన్ కాట్రెల్ ఒక ఓవర్లో రాహుల్ టెవాటియా చేత ఐదు సిక్సర్లు కొట్టించగా.. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ముహమ్మద్ షమీ కూడా నాలుగు ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మినహా, మునుపటి మ్యాచ్‌లో ఏ బౌలర్ ప్రభావం చూపలేకపోయాడు.



కింగ్స్ ఎలెవన్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు అవకాశం రాలేదు, కానీ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఫామ్ కారణంగా బ్యాటింగ్ బలంగా ఉంది. ముంబై మ్యాచ్ గెలవాలంటే, వారిద్దరినీ ఆదిలోనే అవుట్ చేయాలి. రాహుల్, అగర్వాల్ ఇద్దరూ ఇప్పటివరకు చెరొక సెంచరీ సాధించారు. రాయల్స్‌తో మ్యాచ్‌లో వారు మొదటి వికెట్‌కు 183 పరుగుల పార్ట్‌నర్‌షిప్ సాధించారు. ఈ సీజన్‌లో టాప్ ప్లేయర్స్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్లలో ఇద్దరు పంజాబ్ జట్టు నుంచే ఉన్నారు. అలాగే టాప్ బౌలర్ షమీ కూడా పంజాబ్ జట్టులోనే ఉన్నారు.

ఇక ముంబై బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగం చాలా సమతుల్యంగా కనిపిస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మరియు ఇషాన్ కిషన్ వంటి టాప్ ఆర్డర్లో బ్యాట్స్ మెన్లు ఉన్నారు. పొల్లార్డ్ మరియు హార్థిక్ పాండ్యా వంటి దూకుడు బ్యాట్స్ మెన్ ఉన్నారు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ముంబైకి ఉన్నాడు. అయితే ఇంతమంది ఉన్నా కూడా ఒక్కరిలో కూడా నిలకడ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. బూమ్రా అయితే ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అతని ఆటతీరుతో ఆకట్టుకోలేదు. బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మ్యాచ్ గెలుపు విషయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా అవతరించడానికి రోహిత్ శర్మ కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నాడు.



పిచ్ రిపోర్ట్:
అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అబుదాబిలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఇక్కడ ఉంది. 2 మ్యాచ్‌లు ఈ సీజన్‌లో అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగాయి. వీటిలో ముంబై ఒకదానిలో గెలవగా.. ఒకదానిలో ఓడిపోయింది. ఈ మైదానంలో పంజాబ్ తొలిసారి ఆడబోతుంది. ఈ పిచ్‌లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 139గా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్ 129గా ఉంది.

ఈ స్టేడియంలో ఐర్లాండ్, ఆప్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్‌లో హయ్యస్ట్ స్కోర్ 225/7 నమోదైంది. హాంకాంగ్, ఓమన్ మధ్య మ్యాచ్‌లో లోయెస్ట్ స్కోర్ 87పరుగులుగా ఉంది.

Kings XI Punjab Predicted XI:
KL రాహుల్(C&WK), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, సర్ఫరాజ్ ఖాన్, జిమ్మీ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్.

Mumbai Indians Predicted XI:
క్వింటన్ డి కాక్(WK), రోహిత్ శర్మ (C), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ ప్యాటిన్సన్, జస్‌ప్రీత్ బుమ్రా.

KXIP vs MI డ్రీమ్ 11 టీం(Prediction):
KL రాహుల్ (wk), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కీరోన్ పొలార్డ్, గ్లెన్ మాక్స్‌వెల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా

టాప్ 5 బ్యాట్స్‌మెన్లు:

ర్యాంక్ ప్లేయర్ పరుగులు
1. కేఎల్ రాహుల్ 222
2. మయాంక్ అగర్వాల్ 221
3. ఫాఫ్ డు ప్లెసిస్ 173
4. సంజు శాంసన్ 167
5. ఎబీ డివిలియర్స్ 134

టాప్ 5 బౌలర్లు:
ర్యాంక్ ప్లేయర్ Wkts
1. కగిసో రబాడ 7
2. మహ్మద్ షమీ 7
3. సామ్ కుర్రాన్ 5
4. యుజ్వేంద్ర చాహల్ 5
5. ట్రెంట్ బౌల్ట్ 5



Points Table:
S.No జట్టు ఆడినవి గెలిచినవి ఓడినవి NET RR PTS
1. ఢిల్లీ 3 2 1 +0.483 4
2. కోల్‌కతా 3 2 1 +0.117 4
3. రాజస్థాన్ 3 2 1 -0.219 4
4. బెంగళూరు 3 2 1 -1.450 4
5. పంజాబ్ 3 1 2 +1.498 2
6. ముంబై 3 1 2 +0.654 2
7. హైదరాబాద్ 3 1 2 -0.228 2
8. చెన్నై 3 1 2 -0.840 2