Lionel Messi: ప్రపంచ కప్ జట్టు ఆటగాళ్ల కోసం 35 గోల్డ్ ఐఫోన్లు కొన్న లియోనెల్ మెస్సీ

ప్రపంచ కప్ సాధించిన జట్టులోని తన సహచర ఆటగాళ్లు, సిబ్బందికి గోల్డ్ ఐఫోన్లు బహుమతిగా అందించబోతున్నాడు. ఇందుకోసం 35 గోల్డ్ ఐఫోన్లను ఆర్డర్ చేశాడు. వీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయించాడు. 24 క్యారెట్ల గోల్డ్‌తో తయారవుతున్న ప్రతి ఫోన్‌పై ఆటగాడి పేరు, జెర్సీ నెంబర్, అర్జెంటినా లోగో ఉండేలా డిజైన్ చేయించాడు.

Lionel Messi: ప్రపంచ కప్ జట్టు ఆటగాళ్ల కోసం 35 గోల్డ్ ఐఫోన్లు కొన్న లియోనెల్ మెస్సీ

Lionel Messi: గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌ (ఫిఫా వరల్డ్ కప్)లో అర్జెంటినా జట్టును విజయపథంలో నడిపించాడు కెప్టెన్ లియోనెల్ మెస్సీ. దేశానికి వరల్డ్ కప్ అందించి విజేతగా నిలిచాడు. ఈ విజయంలో తనతోపాటు జట్టులోని ఇతర ఆటగాళ్లు, సిబ్బంది సహకారం కూడా ఎంతో ఉంది.

WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం

అందుకే వాళ్లందరికీ బహుమతులు ఇచ్చేందుకు మెస్సీ సిద్ధమయ్యాడు. ప్రపంచ కప్ సాధించిన జట్టులోని తన సహచర ఆటగాళ్లు, సిబ్బందికి గోల్డ్ ఐఫోన్లు బహుమతిగా అందించబోతున్నాడు. ఇందుకోసం 35 గోల్డ్ ఐఫోన్లను ఆర్డర్ చేశాడు. వీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయించాడు. 24 క్యారెట్ల గోల్డ్‌తో తయారవుతున్న ప్రతి ఫోన్‌పై ఆటగాడి పేరు, జెర్సీ నెంబర్, అర్జెంటినా లోగో ఉండేలా డిజైన్ చేయించాడు. ఇప్పటికే ఈ ఫోన్లు మెస్సీ చేతికి అందాయి. తన జీవితంలో ప్రపంచ కప్ గెలవడం మెస్సీకి ఎంతో ప్రత్యేకం. అందుకే ఈ సందర్భాన్ని ఘనంగా జరుపుకోవాలి అనుకున్నాడు. ఈ దశలో బెన్ లైయాన్స్ అనే వ్యాపారవేత్త గోల్డ్ ఐఫోన్ల ఐడియాతో మెస్సీ ముందుకొచ్చాడు.

Cyber Fraud: భారీ లాభాల పేరుతో వ్యాపారికి టోకరా.. రూ.14 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

తన జట్టుకు, సిబ్బందికి ప్రత్యేక బహుమతులు ఇచ్చి ప్రపంచ కప్ విజయాన్ని మెస్సీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడని బెన్ తెలిపాడు. తన సూచనతోనే మెస్సీ గోల్డ్ ఐఫోన్లపై నిర్ణయం తీసుకున్నాడని ఆయన చెప్పారు. మెస్సీ ఆర్డర్ చేసిన మొత్తం ఫోన్ల విలువ దాదాపు రూ.1.7 కోట్లపైనే ఉంటుందని అంచనా. గత ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటినా జట్టు ఫ్రాన్స్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇది అర్జెంటినా గెలిచిన మూడో వరల్డ్ కప్. కెప్టెన్‌గా మెస్సీ సాధించిన తొలి వరల్డ్ కప్.