David Warner: డేవిడ్ వార్నర్‌పై ఎస్సార్‌హెచ్ హార్ట్ బ్రేకింగ్ గా ఉంది – లీసా

సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్.. జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ లీసా స్తాలేకర్‌ తప్పుబట్టారు.

David Warner: డేవిడ్ వార్నర్‌పై ఎస్సార్‌హెచ్ హార్ట్ బ్రేకింగ్ గా ఉంది – లీసా

Srh David Warner

David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్.. జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ లీసా స్తాలేకర్‌ తప్పుబట్టారు. జట్టుకు అందించిన సేవలను అసమానవైనవని అటువంటి వార్నర్‌ విషయంలో అవనమానకరంగా ప్రవర్తించడం సరికాదని చెప్పింది. ప్రముఖ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించింది.

‘డేవిడ్‌ వార్నర్‌ విషయంలో SRH ప్రవర్తన తీరు చూసి గుండె పగిలింది. ఫ్రాంఛైజీ కోసమే అలా చేశాడు. జట్టును ముందుండి నడిపించాడు. 2016లో టైటిల్‌ కూడా అందించాడు. కానీ, కెప్టెన్‌ పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. తన తప్పేంటో అర్థం కావడం లేదు. ఫ్రాంఛైజీ తీరు నచ్చడం లేదు. వచ్చే ఏడాది సీజన్ కు రీటైన్‌ చేసుకోరేమో అనిపిస్తుంది. ఇక చివరి మ్యాచ్‌ లో అయినా ఆడనిస్తే బాగుంటుంది. హైదరాబాద్‌ అభిమానులు ఆట కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.

ఐపీఎల్‌-2021 సీజన్‌ ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస వైఫల్యాలతో కెప్టెన్సీ నుంచి యాజమాన్యం తప్పించింది. తుది జట్టులో కూడా అవకాశం ఇవ్వలేదు. యూఏఈ వేదికగా జరుగుతున్న సెకండాఫ్‌లో కూడా బ్యాటింగ్ లో విఫలం కావడంతో తుదిజట్టు జాబితాలో చేర్చడం లేదు.

…………………………………………………… : ‘మా’ సభ్యుడిని బెదిరించిన పృథ్వీ రాజ్

ఇటీవలి కేకేఆర్‌ మ్యాచ్‌లో డగౌట్‌లో వార్నర్‌ కనిపించడంతో అభిమానులు కాస్త సంతోషించారు. హైదరాబాద్‌ తరపున ఇదే చివరి సీజన్‌ కాబోతుందంటూ వార్నర్‌ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో… లీసా వలె ఫ్యాన్స్‌ సైతం అతడిని చివరి మ్యాచ్‌ ఆడనివ్వాలని కోరుతున్నారు. బుధవారం హైదరాబాద్‌.. ఆర్సీబీతో తలపడి విజయం సాధించింది.