సినిమా కాదంటున్న నెటిజన్లు : ఓన్లీ నిక్కర్ తో విరాట్ కోహ్లీ ఫొటో

  • Published By: madhu ,Published On : September 5, 2019 / 12:36 PM IST
సినిమా కాదంటున్న నెటిజన్లు : ఓన్లీ నిక్కర్ తో విరాట్ కోహ్లీ ఫొటో

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. షర్ట్ లేకుండా కూర్చొన్న తన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంతే నెటిజన్లు తమాషా కామెంట్స్, సెటైర్స్‌ విసురుతున్నారు. రాత్రి వేళ..చిన్న వెలుగు కింద ఓ బండపై కోహ్లీ కూర్చొన్నాడు. ఆ సమయంలో అతను షర్ట్ ధరించలేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయేసరికి ఈయన పెద్ద మొత్తంలో చలాన్ చెల్లించి ఇలా దిగాలుగా కూర్చొని ఉన్నట్టున్నారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. 

‘మనం అంతర్లీనంగా చూస్తున్నంత కాలం..బయట దేనినీ వెతకాల్సిన అవసరం లేదు’. అనే క్యాప్షన్ జత చేసి కోహ్లీ ఫొటోను ట్వీట్ చేశారు. అమీర్ ఖాన్ నటించిన పీకే సీక్వెల్ వస్తుందోమోనని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. ఇదే క్యాప్షన్ బట్టలు వేసుకుని చెప్పవచ్చు కదా అని ఒకరు, ఇలాంటి పనులు చేయవద్దని..వదినకు నచ్చవని మరొకరు కామెంట్స్ చేశారు. 
Read More : గురువుకు నివాళులర్పించిన సచిన్
టెస్టు క్రికెట్ చరిత్రలో రికార్డులకెక్కాడు కోహ్లీ. ఇటీవలే జరిగిన వెస్టిండీస్‌లో జరిగిన టూర్‌ను టీమిండియా విజయంతో ముగించింది. టీ 20, తర్వాత వన్డే, తాజాగా టెస్టు సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసి పర్యటనను పరిపూర్ణం చేసింది.