FIFA World Cup 2022: మేము సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరడానికి కారణం ఇదే..: అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ

ఫిఫా ప్రపంచ కప్‌-2022 మొదటి సెమీఫైనల్లో క్రొయేషియాపై 3-0 గోల్స్ తో తమ జట్టు గెలవడంపై అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో తాము ఆడిన తొలి మ్యాచులో ఓడిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. నవంబరు 22న సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచులో ఓడిపోవడమే ఇప్పుడు తమ జట్టు ఫైనల్ వరకు వెళ్లడానికి కారణమైందని చెప్పాడు. మొదటి మ్యాచులో ఓటమి తమను మరింత శక్తిమంతం చేసిందన్నాడు.

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్‌-2022 మొదటి సెమీఫైనల్లో క్రొయేషియాపై 3-0 గోల్స్ తో తమ జట్టు గెలవడంపై అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో తాము ఆడిన తొలి మ్యాచులో ఓడిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. నవంబరు 22న సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచులో ఓడిపోవడమే ఇప్పుడు తమ జట్టు ఫైనల్ వరకు వెళ్లడానికి కారణమైందని చెప్పాడు. ఆ మ్యాచులో 2-1 తేడాతో అర్జెంటీనా ఓడిపోయింది. అనంతరం పుంజుకుని తదుపరి అన్ని మ్యాచుల్లోనూ ధాటిగా ఆడి ఇప్పుడు ఫైనల్ కు దూసుకెళ్లింది.

‘‘మొదటి మ్యాచులో ఓడిపోవడం మా జట్టుకు పెద్ద దెబ్బే. సౌదీ అరేబియా చేతిలో మేము ఓడిపోతామని అనుకోలేదు. అది మా జట్టు ఆటతీరును, నైపుణ్యాలను పరీక్షించింది. అయితే, మా జట్టు ఎంత శక్తిమంతమైందో తరువాత టీమ్ సభ్యులు నిరూపించారు. తరువాతి మ్యాచుల్లో గెలిచాము. మొదటి మ్యాచు ఓడిపోవడంతో ఇక ప్రతి మ్యాచు మాకు ఓ ఫైనల్ మ్యాచులా మారింది.

వాటన్నింటినీలో గెలిచినట్లు ఫైనల్లోనూ గెలుస్తామని భావిస్తున్నాము. ఒక్క మ్యాచులో ఓడిపోయినా పరిస్థితులు మాకు ప్రతికూలంగా మారతాయని మాకు తెలుసు. మొదటి మ్యాచులో ఓటమి మమ్మల్ని మరింత శక్తిమంతం చేసింది. ఫైనల్ మ్యాచులో మేము మా శక్తి మేరకు పోరడతాం. ప్రస్తుతం ఫైనల్ చేరినందుకు మేము క్షణాలను మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం’’ అని మెస్సీ చెప్పాడు. కాగా, ఇవాళ రాత్రి ఫ్రాన్స్-మొరాకో మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచు జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం అర్జెంటీనాతో పోటీ పడుతుంది.

Cisco Lay Off : బడా కంపెనీల బాటలోనే సిస్కో .. 4,000మంది ఉద్యోగులు తొలగింపు

ట్రెండింగ్ వార్తలు