World Cup : న్యూజిలాండ్‌పై అఫ్ఘానిస్తాన్ గెలిస్తే సందేహాలు వస్తాయి, పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఒకవేళ కివీస్‌ గెలిస్తే అది నేరుగా సెమీస్‌ చేరే అవకాశం ఉండగా.. అఫ్ఘాన్ గెలిస్తే ఆ జట్టుతో పాటు భారత్ కూ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కివీస్ పై అప్ఘానిస్తాన్ గెలవాలని భారత అభిమానులు.

World Cup : న్యూజిలాండ్‌పై అఫ్ఘానిస్తాన్ గెలిస్తే సందేహాలు వస్తాయి, పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

World Cup Shoaib Akhtar

World Cup : టీ20 వరల్డ్ కప్ ఆఖరి దశకు చేరుకుంది. గ్రూప్‌-2 నుంచి ఇప్పటికే పాకిస్తాన్ నాలుగు విజయాలతో సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన స్థానం కోసం మూడు జట్లు భారత్‌, న్యూజిలాండ్‌, అఫ్ఘానిస్తాన్ పోటీపడుతున్నాయి. స్కాట్లాండ్‌పై సూపర్ విక్టరీతో టీమిండియా సైతం ఇప్పుడు పోటీలోకి వచ్చింది. అయితే, ఆదివారం అప్ఘానిస్తాన్-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఎవరు సెమీస్‌కు చేరతారనే విషయంపై ఒక అంచనా ఏర్పడుతుంది. ఒకవేళ కివీస్‌ గెలిస్తే అది నేరుగా సెమీస్‌ చేరే అవకాశం ఉండగా.. అఫ్ఘాన్ గెలిస్తే ఆ జట్టుతో పాటు భారత్ కూ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కివీస్ పై అప్ఘానిస్తాన్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానల్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

‘ఒకవేళ అఫ్ఘానిస్తాన్ చేతిలో న్యూజిలాండ్‌ ఓడిపోతే సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు వ్యక్తమవుతాయి. నేను ముందే ఈ విషయం గురించి చెప్పదల్చుకున్నా. అదే జరిగితే సోషల్‌ మీడియాలో మరో ట్రెండింగ్‌ న్యూస్‌ ప్రచారం అవుతుందని భావిస్తున్నా. ఇప్పుడు నేను ఎలాంటి వివాదాల్లో చిక్కుకోవాలని లేదు. ఈ విషయంపై మాట్లాడదల్చుకోలేదు. కానీ, న్యూజిలాండ్‌లో ఉండే పాకిస్తానీయుల సెంటిమెంట్లు అధికంగా ఉంటాయి’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

అలాగే అఫ్ఘాన్ కన్నా న్యూజిలాండ్‌ జట్టే బలమైందని, దురదృష్టం కొద్దీ వాళ్లు ఓడితే సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఆపడం ఎవరివల్లా కాదన్నాడు. ఇక భారత్ పుంజుకోవడంపై స్పందిస్తూ.. కోహ్లీసేన ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడంతో టోర్నీ ఆసక్తిగా మారిందని చెప్పాడు. ఒకవేళ భారత్ సెమీస్‌ చేరితే ఫైనల్లో పాకిస్తాన్ తో మరోసారి తలపడే అవకాశం ఉందన్నాడు. భారత్ బాగా ఆడిందని, కాకపోతే కాస్త ఆలస్యంగా రాణించిందని అక్తర్ అన్నాడు.

Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

ఈ ప్రపంచకప్‌ టోర్నీలో తొలుత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌, ఆ తర్వాత కివీస్ చేతిలో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్‌లో అఫ్ఘాన్ పై 66 పరుగుల భారీ తేడాతో గెలవడంతో ఆ మ్యాచ్‌ను భారత్‌ ఫిక్స్‌ చేసిందని పాక్ అభిమానులు ట్విటర్‌లో ప్రచారం చేశారు. దీంతో ఆ రోజంతా అది ట్రెండింగ్‌లో నడిచింది. ఈ నేపథ్యంలోనే అప్ఘాన్ చేతిలో కివీస్ ఓడితే మళ్లీ అలాంటి పోస్టులే వైరల్‌ అవుతాయని అక్తర్‌ సందేహం వ్యక్తం చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar)