IPL 2023: బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. అభిమానుల కేరింతలతో మారుమోగిన చెపాక్ స్టేడియం.. వీడియో వైరల్

ఈనెల 31న పదహారవ సీజన్ ఐపీఎల్ - 2023 సందడి షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.

IPL 2023: బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. అభిమానుల కేరింతలతో మారుమోగిన చెపాక్ స్టేడియం.. వీడియో వైరల్

MS Doni

IPL 2023: ఐపీఎల్ -2023 (IPL 2023) పదహారవ సీజన్ సందడి మొదలైంది. ఈనెల 31 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans) తలపడనున్నాయి. ఇప్పటికే సీఎస్‌కే (CSK) కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తాజాగా  చెన్నైలోని ప్రసిద్ధ ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో సీఎస్‌కే జట్టు సభ్యులు ప్రాక్టీస్ చేశారు. క్రికెటర్ల ప్రాక్టీస్ చూసేందుకు భారీగా స్టేడియంకు క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.

IPL 2023-David Warner: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషభ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్

సీఎస్‌కే జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా అభిమానులు ఆసక్తిగా గమనించారు. ఇంతలోనే డ్రస్సింగ్ రూం నుంచి లెజండరీ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ గ్రౌండ్‌లోకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. కాళ్లకు ఫ్యాడ్స్, చేతులకు గ్లౌజులు, తలకు హెల్మెంట్ ధరించి బ్యాట్ ఊపుకుంటూ స్టైలిష్‌గా గ్రౌండ్‌లోకి మహేంద్ర సింగ్ ధోనీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు కొంచెం నిశబ్ధంగా అనిపించిన చెపాక్ స్టేడియం ఒక్కసారిగా ధోనీ నామస్మరణతో మారుమోగిపోయింది. ధోనీ గ్రౌండ్‌లో ఉన్నంతసేపు ధోనీ, ధోనీ అనే నామస్మరణతో అభిమానులు సందడి చేశారు.

 

 

ఇందుకు సంబంధించిన వీడియోను సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 41 ఏళ్ల ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శుక్రవారం (ఈనెల 31)న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.