Olympics : ఒలింపిక్స్ పోటీలు.. మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపిక

మహిళా స్విమ్మింగ్ విభాగంలో భారతదేశం నుంచి మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపిక అయ్యారు. యూనివర్సాలిటీ కోటాలో ఆమె టోక్యో ఒలింపిక్స్‌ కు ఎంపికయ్యారని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) శుక్రవారం ధృవీకరించింది.

Olympics : ఒలింపిక్స్ పోటీలు.. మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపిక

Maana Patel

Maana Patel : ఒలింపిక్స్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మహిళా స్విమ్మింగ్ విభాగంలో భారతదేశం నుంచి మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపిక అయ్యారు. యూనివర్సాలిటీ కోటాలో ఆమె టోక్యో ఒలింపిక్స్‌ కు ఎంపికయ్యారని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) శుక్రవారం ధృవీకరించింది. మొట్టమొదటి మహిళా స్విమ్మర్ గా మానా పటేల్ నిలవడం విశేషం. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మానా పటేల్ ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు అభినందించారు.

మానా పటేల్ విషయానికి వస్తే..అహ్మదాబాద్ చెందిన ఈమె..బ్యాక్ స్ట్రోక్ స్విమ్మర్. శ్రీహరి నటరాజ్, సజన్ ప్రకాష్ లతో కలిసి మానా పటేల్ పాల్గొన్నారు. యూనివర్సాలిటీ కోటా ద్వారా..పోటీల్లో సత్తా చాటే ఓ మేల్, ఓ ఫిమేల్ అథ్లెట్ ను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. 2019 సంవత్సరంలో గాయాలపాలైంది అనంతరం ఈ సంవత్సరం ప్రాక్టీస్ మొదలు పెట్టారు.

2018 తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్స్ లో పటేల్ పాల్గొన్నారు. మూడు బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్లను సాధించారు. మానా పటేల్ జాతీయ క్రీడల్లో పాల్గొన్న 21 ఏళ్ల మానా…50 బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. 60వ నేషనల్ గేమ్స్ లో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో పాల్గొని స్వర్ణం సాధించారు. 72వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్ షిప్ లో మూడు బంగారు పతకాలు సాధించారు మానా.