పిచ్ లెవలింగ్ కోసం రోడ్ రోలర్‌ డ్రైవింగ్ చేస్తున్న ధోనీ, బొప్పాయి పంట వేస్తున్నాడట

పిచ్ లెవలింగ్ కోసం రోడ్ రోలర్‌ డ్రైవింగ్ చేస్తున్న ధోనీ, బొప్పాయి పంట వేస్తున్నాడట

ఒక్క మనిషి డిఫరెంట్ రోల్స్ అంటే ధోనీ పేరే చెప్పాలి. ఓ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా, టిక్కెట్ కలెక్టర్‌గా, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్‌గా నిజ జీవితంలో ఇన్ని పాత్రలు పోషించే ధోనీ.. మరో గెటప్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. జార్ఖండ్ లోని క్రికెట్ స్టేడియంలో క్రికెట్ పిచ్‌ను రోడ్ రోలర్‌తో లెవల్ చేస్తూ దర్శనమిచ్చాడు. సాధారణంగా డ్రైవింగ్ అంటే ధోనీకి ఇష్టమే కానీ, ఇలా రోడ్ రోలర్‌తో క్రికెట్ పిచ్‌ కోసం కష్టపడేంత ఇష్టమా అని ఆశ్చర్య పోతున్నారు నెటిజన్లు. 

జార్ఖండ్ క్రికెట్ స్టేడియం పిచ్ లెవల్ చేయడమే కాదు.. అక్కడ మొక్కల పెంపకం బాధ్యత కూడా ధోనీనే తీసుకున్నాడు. బొప్పాయ, పుచ్చకాయలు ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా 20రోజుల్లోనే పండుతున్నాయంటూ ధోనీనే తన ఫేస్‌బుక్ ద్వారా పోస్టు చేశాడు. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎగ్జైట్ అయినట్లు అందులో పేర్కొన్నాడు. 

విత్తనాలు వేస్తూ:

Dhoni పోస్టు చేసిన వీడియోలో వ్యవసాయం మొదలుపెట్టడానికి ముందు ఆనవాయితీగా కొబ్బరికాయ కొట్టి.. పూలు, స్వీట్లతో పూజ చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ స్థలమంతా షీట్లతో కప్పేసి ఆర్గానిక్ వ్యవసాయం కోసం హోల్స్ చేసి ఉంచారు. వాటిలో విత్తనాలు నాటారు ధోనీ.

 

బ్యాట్ పట్టుకుని క్రికెట్ గ్రౌండ్‌లో ధోనీ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ వేదిక కానుంది. మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరిస్తారని చెన్నై జట్టు యజమాని ఇప్పటికే ఖరారు చేశారు. టీ20 వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకునో.. లేదా.. ఐపీఎల్ కోసమో.. ధోనీ జార్ఖండ్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.