Manoj Tiwary: మంత్రిగా ప్రమాణం చేసిన క్రికెటర్

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే.. మే 2 తేదీన ఫలితాలు వెలువడ్డాయి.. టీఎంసీ పార్టీ అత్యధిక స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆ పార్టీ నుంచి బరిలో దిగిన టీంఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విజయం సాధించారు.

Manoj Tiwary: మంత్రిగా ప్రమాణం చేసిన క్రికెటర్

Manoj Tiwary

Manoj Tiwary: పశ్చిమ బెంగాల్ లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే.. మే 2 తేదీన ఫలితాలు వెలువడ్డాయి.. టీఎంసీ పార్టీ అత్యధిక స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆ పార్టీ నుంచి బరిలో దిగిన టీంఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విజయం సాధించారు.

శివ్ పూర్ నుంచి పోటీచేసిన మనోజ్ బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక టీఎంసీ మంత్రి వర్గంలో ఆయనకు స్థానం కల్పించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర యువజన, క్రీడాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు మనోజ్.. ‘కొత్త ప్రయాణం మొదలైంది’ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తనకు కొత్త అనుభూతన్నారు.

తనపై నమ్మకంతో ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన దీదీ మమత, తన సోదరుడు అభిషేక్‌లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, భారత్ తరపున తివారీ 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అలాగే, 16 ఏళ్లపాటు ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో కొనసాగాడు.