MS Dhoni: ఎంఎస్ ధోనీ సలహా డబుల్ మీనింగ్ తో ఉంది – మార్కస్ స్టోయినిస్

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన సలహాలో రెండు అర్థాలు ఉన్నాయని అంటున్నాడు మార్కస్ స్టోనిస్.

MS Dhoni: ఎంఎస్ ధోనీ సలహా డబుల్ మీనింగ్ తో ఉంది – మార్కస్ స్టోయినిస్

Ms Dhoni Stonis

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన సలహాలో రెండు అర్థాలు ఉన్నాయని అంటున్నాడు మార్కస్ స్టోనిస్. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆడుతున్న సమయంలో ధోనీ చెప్పిన సలహా రెండు రకాలుగా అర్థమవుతున్నా తాను సానుకూలంగానే తీసుకున్నానని చెప్తున్నాడు. ఒకవైపు పొగుడుతున్నట్లుగా అనిపించినా మరో వైపు కించపరిచే అర్థం వచ్చేలా ఉందని చెప్పాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన స్టోనిస్ ఒక మ్యాచ్ తర్వాత గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సలహా అడగ్గా.. ధోనీ సలహా ఇచ్చాడట. తాను ఎలా అవుట్ చేయాలనుకున్నాడో వివరించాడట.

‘అతను నాతో నిజాయతీగా ఉంటాడు. నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. ఎలా అవుట్ చేయాలో.. నాకు ఎలా ఫీల్డింగ్ సెట్ చేయాలో తెలుసు. అతను చెప్తుంటే నాకు రెండు రకాలుగా అనిపించింది. ఒకటి కాంప్లిమెంట్ ఇస్తున్నట్లే.. మరొకటి విమర్శిస్తున్నట్లుగానే అనిపించింది. నేను మాత్రం పాజిటివ్ గానే తీసుకున్నా’ అని స్టోనిస్ అన్నాడు.

 

……………………………………. : రూ. 101కే వివో ఫోన్..కండీషన్ అప్లై!

కొందరు ప్లేయర్లు బాధ్యత తీసుకుని చివరి వరకూ ఆడుతుంటారు. మరికొందరు రాగానే స్కోరు చేయాలని ఫీలవుతుంటారు. అలా రెండు రకాల ప్లేయర్లకు రెండు స్ట్రాటజీలు ఫాలో అవుతుంటాడట. అలా తనను గేమ్ ఫినిషర్ గా అభవర్ణించి అతనికి తగ్గట్లుగానే ఫీల్డింగ్ చేసినట్లు తెలిపాడు.

అంతేకాకుండా బలహీనతలపై ఫోకస్ పెట్టాలని.. అలా చేయకపోతే సామర్థ్యాన్ని కోల్పోతామని సూచించాడట. ఆ తర్వాత నుంచి గేమ్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించిందని చెప్పాడు ఈ ఆల్ రౌండర్.