Marnus Labuschange : క్రికెట్‌లో మీరు ఎక్స్‌పర్టా ? ఇది అవుటో కాదో చెప్పండి

క్రికెట్ లో ఎక్స్ పర్టా ? అయితే..ఇది అవుటో కాదో చెప్పండి అంటూ నెట్టింట పోస్టు తెగ వైరల్ అవుతోంది. అసలు అతను ఎలా అవుట్ అవుతాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Marnus Labuschange : క్రికెట్‌లో మీరు ఎక్స్‌పర్టా ? ఇది అవుటో కాదో చెప్పండి

Steve Waugh

New South Wales’ innings : క్రికెట్ లో ఎక్స్ పర్టా ? అయితే..ఇది అవుటో కాదో చెప్పండి అంటూ నెట్టింట పోస్టు తెగ వైరల్ అవుతోంది. అసలు అతను ఎలా అవుట్ అవుతాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. అంపైర్ అవుట్ గా ప్రకటించడం పట్ల కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో..ఓ విచిత్రమైన క్యాచ్ కు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా..పోస్టు చేశారు. Mitchell Swepson బౌలింగ్ చేస్తుండగా…Holt బ్యాటింగ్ చేస్తున్నాడు.

125 ఓవర్ వద్ద బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. Holt కొట్టిన భారీ షాట్ కు బంతి గాల్లోకి ఎగిరింది. క్వీన్స్ లాండ్ ఫీల్డర్ మార్నస్ లబుషేన్ అమాంతం క్యాచ్ పట్టుకున్నాడు. అయితే..తనను తాను నియంత్రించుకోలేక..పట్టుకున్న బంతిని కిందపడేశాడు. అయితే..అంపైర్లు మాత్రం అవుట్ గా ప్రకటించాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం..క్యాచ్ పట్టుకున్న తర్వాత..ఫీల్డర్ తన శరీరంపై, బంతిపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. ఇక్కడ మాత్రం లబుషేన్ బంతిని మధ్యలోనే వదిలేశాడు. 1999 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ వా ఇచ్చిన క్యాచ్ ను సౌతాఫ్రికా ఫీల్డర్ గిబ్స్ అందుకోవడం కూడా కరెక్టే అవుతుందని నెటిజన్లు వాదిస్తున్నారు. ట్రోల్ చేస్తూ..కొందరు కామెంట్స్ చేస్తున్నారు.