Martin Guptill : వామ్మో.. బ్యాటింగ్ చేశాక 4.4 కిలోలు బరువు తగ్గాడు

న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ భారీగా బరువు తగ్గాడు. ఏకంగా 4.4 కేజీలు తగ్గాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. విశేషం ఏంటంటే.. స్కాట్లాండ్ తో మ్యాచ్ తర్వాత.. గప్తిల్ భారీగా

Martin Guptill : వామ్మో.. బ్యాటింగ్ చేశాక 4.4 కిలోలు బరువు తగ్గాడు

Martin Guptill

Martin Guptill : న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ భారీగా బరువు తగ్గాడు. ఏకంగా 4.4 కేజీలు తగ్గాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. విశేషం ఏంటంటే.. స్కాట్లాండ్ తో మ్యాచ్ తర్వాత.. గప్తిల్ భారీగా బరువు తగ్గాడట.

Offline Whatsapp Trick: ఈ ట్రిక్‌తో ఇంటర్నెట్ ఆఫ్ చేయకుండానే.. మీ వాట్సాప్‌ ఆఫ్‌లైన్ చేయొచ్చు..!

స్కాట్లాండ్ తో మ్యాచ్ లో గప్తిల్ వీరవిహారం చేశాడు. 56 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. పరుగుల వరద పారించాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లాక బరువు చూసుకుంటే, 4.4 కిలోలు తగ్గినట్టు తెలిసిందన్నాడు. యూఏఈలో ఉన్న ఉష్ణోగ్రతలకు డీహైడ్రేట్ అయినట్లు గప్తిల్ వివరించాడు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేశానని తెలిపాడు. కాగా, యూఏఈలో ఉన్న ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా ఆటగాళ్లు తొందరగా అలసిపోతారు.