Mary Kom: యువ ప్లేయర్ల కోసం మేరీ కోమ్ త్యాగం

ఇండియన్ బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆసియన్ గేమ్స్ లు ఆడకూడదని నిర్ణయించుకున్నారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం..

Mary Kom: యువ ప్లేయర్ల కోసం మేరీ కోమ్ త్యాగం

Mary Kom

Mary Kom: ఇండియన్ బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆసియన్ గేమ్స్ లు ఆడకూడదని నిర్ణయించుకున్నారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం.. యంగ్ జనరేషన్ కు అవకాశం ఇచ్చేందుకే తాను ఈ సారి తప్పుకుంటున్నట్లు వెల్లడించిందట.

ఐబీఏ ఎలైట్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్, 2022 ఆసియన్ గేమ్స్ మార్చి 7 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ కామెన్వెల్త్ గేమ్స్ కోసమే ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపారు.

‘నేను తప్పుకుని యంగ్ జనరేషన్ కు అవకాశం ఇద్దామని అనుకుంటున్నా. ఇలాంటి పెద్ద టోర్నమెంట్లలో ఆడి అంతర్జాతీయ స్థాయిలో గుర్తు తెచ్చుకునేందుకు యువ ప్లేయర్లకు అవకాశం దక్కుతుంది. నేను కేవలం కామన్వెల్త్ గేమ్స్ కోసమే ప్రిపేర్ అవుతున్నా’ అని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ చెప్పింది మేరీ కోమ్.

Read Also0 : ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించిన మేరీకోమ్.. కన్నీటిపర్యంతం

‘మేరీ కోమ్ ఇండియన్ బాక్సింగ్ కు రెండు దశాబ్దాలుగా టార్చ్ బేరర్ గా నిలిచారు. బాక్సర్లను మాత్రమే కాకుండా క్రీడాకారులు ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఇతర బాక్సర్లకు ఉపయోగపడే విషయం హర్షించదగ్గదే’ అని పేర్కొన్నారు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అజయ్ సింగ్.