Punjab vs Hyderabad, 14th Match Preview- గెలిచేదెవరు? ఎవరి బలం ఏంటీ?

Punjab vs Hyderabad, 14th Match Preview- గెలిచేదెవరు? ఎవరి బలం ఏంటీ?

2

PBKS vs SRH: ఐపీఎల్ 2021లో ఇవాళ(21 ఏప్రిల్ 2021) రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అందులో తొలి మ్యాచ్ పంజాబ్, హైదరాబాద్ జట్లు మధ్య మధ్యాహ్నం 03:30 నుండి ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. రెండు జట్లు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ జట్టు రెండు పరాజయాలు, మూడు మ్యాచ్‌లలో ఒక విజయంతో ఏడవ స్థానంలో ఉండగా.. అదే సమయంలో, హైదరాబాద్ మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి టోర్నమెంట్‌లో ఖాతా తెరవలేక చివరి స్థానంలో ఉంది.

హైదరాబాద్ విషయానికొస్తే, మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆందోళన కలిగిస్తుంది. అలాగే, జట్టు కెప్టెన్ వార్నర్ ఇప్పటివరకు బ్యాట్‌తో రాణించలేదు. చెన్నై స్లో పిచ్‌పై హైదరాబాద్ జట్టు కష్టపడాల్సి వస్తొంది. గాయం కారణంగా కేన్ విలియమ్సన్ మ్యాచ్‌లకు దూరం అవ్వడంతో.. బ్యాటింగ్‌లో లోటు కనిపిస్తుంది. అతను ఫిట్‌గా ఉంటే, హైదరాబాద్ అతన్ని ఈరోజు జట్టులో చేర్చాలని భావిస్తుంది జానీ బెయిర్‌స్టో వేగంగా బ్యాటింగ్ చేస్తున్నా.. అతని తర్వాత నిలబడే ప్లేయర్లు లేకపోవడం మైనస్.

ఈ మ్యాచ్‌లో నటరాజన్‌కు జట్టులో చోటు ఇవ్వవచ్చు.. భూవనేశ్వర్ కూడా రాణిస్తే బౌలింగ్ విభాగం బలంగా అవుతుంది. స్లో పిచ్‌లో స్పిన్నర్లు ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితిలో స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ ఈరోజు మ్యాచ్‌లో కీలకం కానుంది. సన్ రైజర్స్ బౌలర్లను ఎదుర్కొని పంజాబ్ బ్యాట్స్‌మెన్ పెద్ద స్కోరు చేయడం మాత్రం కష్టమే.

మరోవైపు పంజాబ్ కూడా ఈరోజు సన్‌రైజర్స్‌పై గెలిచి ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని బలంగా ప్రయత్నిస్తుంది. పంజాబ్ జట్టులో స్టార్ ప్లేయర్స్‌కు కొరత లేదు.. కానీ గెలవాలంటే మాత్రం ప్లేయింగ్ లెవెన్‌ను జాగ్రత్తగా ఎన్నుకోవాలి. మయాంక్ అగర్వాల్‌తో పాటు కెప్టెన్ కెఎల్ రాహుల్‌.. ఓపెనర్‌లుగా ఉంటారు. మూడవ స్థానంలో క్రిస్ గేల్‌ మిడిల్ ఆర్డర్‌లో దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారూఖ్ ఖాన్ ఉన్నారు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌తో పాటు బ్యాట్స్ కూడా చేశాడు. జట్టులోని ఇతర బౌలర్లలో మురుగన్ అశ్విన్, షమీ, అర్షదీప్ సింగ్‌లకు జట్టులో అవకాశం రావచ్చు. అయితే జట్టులో బౌలర్లు రాణించకపోవడం కాస్త ఇబ్బందికర విషయం. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకం కాగా.. స్పిన్నర్లు ఎక్కువగా జట్టులో లేకపోవడం ఇబ్బందికర విషయం.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. స్పిన్నర్లకు అనుకూలమైన ఈ పిచ్ ఈ సంవత్సరం చాలా భిన్నంగా ఉంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. రాత్రి మ్యాచ్‌లో మంచు కూడా చాలా ముఖ్యమైన అంశం. పిచ్ మరియు పరిస్థితులపై ఆధారపడి, టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.

మ్యాచ్ అంచనా ప్రకారం.. హైదరాబాద్ స్పిన్ విభాగం ఖచ్చితంగా పంజాబ్ కంటే మెరుగ్గా ఉంది. రషీద్ రాణిస్తే పంజాబ్‌కు చుక్కలే.. విలియమ్సన్, నాటరాజన్ తిరిగి జట్టుతో కలిస్తే.. హైదరాబాద్ విజయం కష్టం కాదు.. కాబట్టి హైదరాబాద్‌కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్ విషయానికి వస్తే, పంజాబ్ పైచేయిలో ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ చేస్తే మాత్రం.. పంజాబ్ గెలిచే అవకాశం ఉంది.

రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల గురించి మాట్లాడితే.. హైదరాబాద్ పైచేయిలో ఉంది. రెండింటి మధ్య 16 మ్యాచ్‌లు జరగగా.. హైదరాబాద్ జట్టు 11 మ్యాచ్‌లను గెలిచింది. పంజాబ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. గత ఐదు మ్యాచ్‌ల గురించి మాట్లాడితే.. హైదరాబాద్ పైచేయి సాధించింది. హైదరాబాద్ మూడు మ్యాచ్‌లు, పంజాబ్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐపీఎల్ 2020లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి.

ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి బ్యాటింగ్ చేసి ఆరు వికెట్లకు 201 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో ఈ మ్యాచ్‌లో 97 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు 132 పరుగులు మాత్రమే చేసింది. అదే సమయంలో, రెండవ మ్యాచ్ చాలా తక్కువ స్కోరింగ్. పంజాబ్ జట్టు 12 పరుగుల తేడాతో గెలిచింది. పంజాబ్ జట్టు ఏడు వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. 114 పరుగులకు పంజాబ్‌ హైదరాబాద్‌ను కట్టడి చేసింది. పంజాబ్ తరఫున అర్ష్‌దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Probable XI): David Warner (C), Jonny Bairstow (WK), Manish Pandey, Kane Williamson, Vijay Shankar, Abdul Samad, Kedar Jadhav, Rashid Khan, Bhuvneshwar Kumar, Natarajan, Khaleel Ahmed

పంజాబ్ కింగ్స్(Probable XI): Mayank Agarwal, KL Rahul(C&WK), Chris Gayle, Deepak Hooda, Nicholas Pooran, Shahrukh Khan, Fabian Allen, Jhye Richardson, Murugan Ashwin, Mohammad Shami, Arshdeep Singh