T20 World Cup : ఆసీస్ క్రికెటర్ల సంబరాలు, బూటులో కూల్ డ్రింక్ పోసుకుని..తాగారు

ఆసీస్ క్రికేటర్ల సంబరాలు మాములుగా లేవు. కేరింతలు, కౌగిలింతలు, కేరింతలతో హల్ చల్ చేశారు. మైదానంలో రచ్చ రచ్చ చేశారు.

T20 World Cup  : ఆసీస్ క్రికెటర్ల సంబరాలు, బూటులో కూల్ డ్రింక్ పోసుకుని..తాగారు

Icc

Matthew Wade And Marcus Stoinis : ఆసీస్ క్రికెటర్ల సంబరాలు మాములుగా లేవు. కేరింతలు, కౌగిలింతలు, కేరింతలతో హల్ చల్ చేశారు. మైదానంలో రచ్చ రచ్చ చేశారు. తొలిసారి టీ 20 వరల్డ్ కప్ ను చేజిక్కించుకోవడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దుబాయ్ మైదానంలో గెలుపు సంబరాలు చేసుకున్నారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. న్యూజిలాండ్ బౌలర్ సౌథీ బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మాక్స్ వెల్ (28 నాటౌట్) బౌండరీ బాదగానే…ఆసీస్ క్రీడాకారులు ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు.

Read More : TTD : శ్రీవారిని దర్శించుకున్న కర్నాటక సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎస్

ఒకరినొకరు ఆలింగనాలు చేసుకున్నారు. తొలిసారి కప్ ను ముద్దాతుండడంతో పలువురు ఆనందభాష్పాలు కార్చారు. అనంతరం వీరంతా డ్రెసింగ్ రూమ్ చేరుకుని రచ్చ రచ్చ చేశారు. ఆసీస్ కీపర్ మాథ్యువేడ్, ఆల్ రౌండర్ స్టోయినిస్ ఓ బూటులో కూల్ డ్రింక్ పోసుకుని తాగడం విశేషం. గెలిచిన సందర్భంగా వీరిద్దరూ చేసిన వీడియోను Icc ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేసింది. ఈ వీడియోను నెట్టింట వైరల్ గా మారిపోయింది.

Read More : Penugonda: పెనుగొండలో టెన్షన్..టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ

టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా ఆసీస్ నిలిచింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ తో ఫైనల్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో కొత్త చాంపియన్ గా నిలిచింది. 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను 18.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 77 పరుగులు), డేవిడ్ వార్నర్(38 బంతుల్లో 53 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిచెల్ మార్ష్ నాటౌట్ గా నిలిచి జట్టుని గెలిపించాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేశాడు. దీంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ మ్యాచ్ ని ముగించింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ లోకి వచ్చిన కివీస్.. కప్ ను మాత్రం ముద్దాడ లేకపోయింది.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)