T20 World Cup 2021 : మాథ్యూ వేడ్ విజయం వెనుక ఎన్నో కష్టాలు, సమస్యలు

మాథ్యూ వేడ్..సంచలన ఇన్సింగ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఇతనికి సంబంధించిన జీవిత విశేషాలు వెలుగు చూస్తున్నాయి. అతను ఎలా బ్రతికాడో తెలుసుకుంటున్న క్రీడాభిమానులు...

T20 World Cup 2021 : మాథ్యూ వేడ్ విజయం వెనుక ఎన్నో కష్టాలు, సమస్యలు

T20

Matthew Wade Cancer : టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్రీదీ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్స్ లు బాది..పాక్ ఫైనల్ ఆశలను గల్లంత చేసిన ఆస్ట్రేలియ బ్యాట్స్ మెన్ మాథ్యూ వేడ్..సంచలన ఇన్సింగ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఇతనికి సంబంధించిన జీవిత విశేషాలు వెలుగు చూస్తున్నాయి. అతను ఎలా బ్రతికాడో..తెలుసుకుంటున్న క్రీడాభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎందుకంటే..మాథ్యూ తన నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడు. తన జీవితానికి సంబంధించిన విషయాలను అతనే స్వయంగా మార్నింగ్ హెరాల్డ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Read More : Bigg Boss 5 : హౌస్ నుంచి జెస్సి అవుట్.. ఈ సారి కన్ఫర్మ్..

16 ఏళ్ల వయస్సులో క్యాన్సర్ బారిన పడి…దాని నుంచి బయటపడ్డాడు. ఫుట్ బాల్ టోర్నీ ఆడుతుండగా..గాయానికి గురవుతాడు. ఆసుపత్రికి వెళితే..వైద్యులు పరీక్షించి..భయంకరమైన విషయం చెబుతారు. క్యాన్సర్ సోకిందని తెలవడంతో మాథ్యూ తీవ్రంగా బాధ పడ్డాడు. అయితే..తనకు తాను ధైర్యాన్ని కూడబెట్టుకుని..కీమోథెరపీతో చికిత్స పొందుతూ క్రికెట్ కోచింగ్ తీసుకున్నాడు. ప్లంబర్ గా అప్రెంటిషిప్ తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు ప్లంబర్ గా పనిచేశాడు. ఫామ్ లేని కారణంగా..2018లో అతడు జాతీయ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది.

Read More : Pollution: ఆస్పత్రులు కిటకిట.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

ఆ సమయంలో..కార్పెంటర్ గా అప్రెంటిషిప్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇంటి వద్దే..9 నుంచి 10 నెలలు దాక కార్పెంటర్ గా పనిచేశాడు మాథ్యూ. జట్టుకు దూరమైనా..చాలా విషయాలు తెలుసుకున్నట్లు, వారానికి మూడు రోజులు కార్పెంటర్ గా పని చేస్తూ..మిగతా రోజులు తన కుటుంబంతో సమయం వెచ్చించేవాడనని తెలిపారు. కార్పెంటర్, ప్లంబర్ గా పనిచేసే సమయంలో…సాధారణ జీవితం ఎలా గడపాలో తెలుసుకున్నట్లు, గుంతలు తవ్వడం, బోరింగ్ కాంక్రీట్ వంటి పనుల్లో ప్రజలు ఎలా కష్టపడుతున్నారో తన కళ్లతో చూశానన్నారు.

Read More : T20 World Cup 2021: ఐసీయూ నుంచి వచ్చి మ్యాచ్ ఆడిన పాక్ ప్లేయర్ రిజ్వాన్.. ఇండియన్ డాక్టర్ ట్రీట్మెంట్

చికిత్స సమయంలో శారీరంగా బలహీనంగా ఉన్నాడు. క్యాన్సర్ కారణంగా..జుట్టు పోవడంతో..జనాల మధ్య తిరగడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వెల్లడించాడు. అంతేగాకుండా.. కంటి చూపు సమస్య కూడా ఉండేది. క్రికెట్ ఆడే సమయంలో బంతి ఎలా వస్తుందో అర్థం కాలేకపోయేదని, ప్రధానంగా పింక్ బాల్ ఆడే సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నాడు.  అయితే…తన సక్సెస్ వెనుక తన భార్య జూలియ పాత్ర ఉందని సగ్వరంగా ఆయన ప్రకటించారు. యాషెస్ సిరీస్ కు ముందు అతడిని ఆస్ట్రేలియా – ఏ జట్టుకు ఎంపిక చేశారు.

Read More : TPT : దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం

ఆ సమయంలో జూలియా గర్భవతి. ఈ సమయంలో పర్యటనకు వెళ్లడం ఇష్టం లేదని, తాను రాలేనని సెలక్టర్లకు చెబుతానని జూలియాకు చెప్పాడు. కానీ..అతడి భార్య ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సిందేనని లేకపోతే..వేరొకరని ఎంపిక చేస్తారని చెప్పింది. ఈ అవకాశం ఎంతకష్టపడ్డారో తనకు తెలుసని, కష్టం వృథా కావొద్దని అనుకుంటే..వెళ్లాల్సిందేనని చెప్పడంతో మాథ్యూ ఇంగ్లండ్ వెళ్లాడు. ఆస్ట్రేలియా ఏ తరపున ఆడిన మాథ్యూ మ్యాచ్ లో రాణించాడు. దీంతో సెలెక్టర్లు జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. సో..ఈ స్థానానికి రావడం వెనక మాథ్యూ చాలా కష్టాలు, సమస్యలను ఎదుర్కొన్నాడు.