Meg Lanning: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్.. వైస్ కెప్టెన్‌గా జెమిమా రోడ్రిగ్స్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్‌ను, వైస్ కెప్టెన్‌గా జెమిమా రోడ్రిగ్స్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ ల్యానింగ్ ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ విజయవంతమైన మహిళా కెప్టెన్‌గా మెగ్ పేరు తెచ్చుకున్నారు.

Meg Lanning: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్.. వైస్ కెప్టెన్‌గా జెమిమా రోడ్రిగ్స్

Meg Lanning: మరో రెండు రోజుల్లో డబ్ల్యూపీఎల్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్, వైస్ కెప్టెన్‌లను ఎంపిక చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్‌ను, వైస్ కెప్టెన్‌గా జెమిమా రోడ్రిగ్స్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది.

WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం

ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ ల్యానింగ్ ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ విజయవంతమైన మహిళా కెప్టెన్‌గా మెగ్ పేరు తెచ్చుకున్నారు. గత ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఆమె కెప్టెన్‌గా ఉన్నారు. మెగ్ కెప్టెన్‌గా అత్యధికంగా నాలుగు టీ20 వరల్డ్ కప్‌లు గెలుచుకోవడం విశేషం. ఆల్ రౌండర్ అయిన జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టు క్రీడాకారిణి అనే సంగతి తెలిసిందే. మెగ్ ఇప్పటికే డబ్ల్యూపీఎల్‌లో పాల్గొనేందుకు ముంబై చేరుకున్నారు.

Adani vs Hindenburg: అదాని-హిండెన్‌బర్గ్ అంశంపై విచారణకు కమిటీ ఏర్పాటు.. ఆదేశించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది. మార్చి 4 శనివారం డబ్ల్యూపీఎల్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా మహిళా ప్రీమియర్ లీగ్ నిర్వహించబోతుండటంతో బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించబోతుంది. బాలీవుడ్ తారలు కియరా అద్వానీ, క్రితి సనన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. మహిళలకు ఈ ఈవెంట్‌కు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. డబ్ల్యూపీఎల్‌లో ఈ ఏడాది జరిగే అన్ని మ్యాచులు ముంబైలోనే నిర్వహిస్తారు. జియో సినిమాలో మ్యాచుల్ని ఉచితంగా వీక్షించవచ్చు.