Lionel Messi: ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్న మెస్సీ… ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో వీడ్కోలు చెప్పనున్న అర్జెంటినా దిగ్గజం

ప్రపంచ కప్ తర్వాత ఫుట్‌బాల్‌కు అర్జెంటినా ఆటగాడు, లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ గుడ్‌బై చెప్పబోతున్నాడు. ‘ప్రపంచ కప్ ఫైనల్’ తన చివరి మ్యాచ్ అంటూ వెల్లడించాడు.

Lionel Messi: ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్న మెస్సీ… ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో వీడ్కోలు చెప్పనున్న అర్జెంటినా దిగ్గజం

Lionel Messi: లెజెండరీ ఫుట్‌బాల్‌ ప్లేయర్, అర్జెంటినా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఫుట్‌బాల్‌‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ద్వారా ఆయన క్రీడా ప్రపంచానికి వీడ్కోలు పలకబోతున్నట్లు మెస్సీ అధికారికంగా వెల్లడించాడు. తాజా వరల్డ్ కప్‌లో అర్జెంటినా జట్టు క్రొయేషియాపై నెగ్గి ఫైనల్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు

సెమీ ఫైనల్‌లో అర్జెంటినా విజయం సాధించడంలో మెస్సీ పాత్ర కీలకం. ఒక గోల్ సాధించడమే కాకుండా, తన జట్టు తరఫున మరో ఆటగాడు గోల్ సాధించడంలో సాయపడ్డాడు. దీంతో మరోసారి మెస్సీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇప్పటికే విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఈ అర్జెంటినా స్టార్ ఇక తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ మెస్సీకి వీడ్కోలు మ్యాచ్ కానుంది. మెస్సీ తన కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు. ప్రపంచ కప్‌లలో ఇప్పటివరకు 11 గోల్స్ సాధించాడు. తాజా వరల్డ్ కప్‌లోనే ఐదు గోల్స్ సాధించి బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో అర్జెంటినా ఆరు మ్యాచులు ఆడగా, అందులో నాలుగుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడంటే అతడి ఫామ్ అర్థం చేసుకోవచ్చు.

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తగ్గిన రద్దీ.. వెయిటింగ్ టైమ్ ఐదు నిమిషాలే

ఇది మెస్సీ ఆడుతున్న ఐదో వరల్డ్ కప్ కావడం మరో విశేషం. ఈ వరల్డ్ కప్ ద్వారా మెస్సీ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీ ద్వారా ఫుట్‌బాల్ దిగ్గజాలైన డిగో మారడోనా, జేవియర్ మాషెరానో రికార్డును అధిగమించాడు. వారిద్దరూ నాలుగు వరల్డ్ కప్‌లు మాత్రమే ఆడాడు. వరల్డ్ కప్‌లో 25 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా మెస్సీనే. ఎన్ని విజయాలు సాధించినప్పటికీ, తన జట్టుకు ప్రపంచ కప్ అందించడమే ఒక ఆటగాడికి అత్యుత్తమ విజయం. తన క్రీడా జీవితంలో ఎన్నో విజయాలు నమోదు చేసిన ఆటగాడు మెస్సీ వరల్డ్ కప్ విజయంతో ఆటకు వీడ్కోలు పలుకుతాడేమో చూడాలి.