చూడకుండానే..రూబిక్ క్యూబ్ సాల్వ్ చేశాడు, సచిన్ ఫిదా..వీడియో వైరల్

చూడకుండానే..రూబిక్ క్యూబ్ సాల్వ్ చేశాడు, సచిన్ ఫిదా..వీడియో వైరల్

Sachin Tendulkar : రూబిక్ క్యూబ్..అనేక రంగుల్లో ఉండే..దీనిని సాల్వ్ చేయాలంటే..చాలా సమయమే పడుతుంది. అన్ని రంగులను ఒక్కదగ్గరకు తీసుకుని రావాలంటే..మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది. కానీ..కొంతమంది..ఇందులో నైపుణ్యం కలిగిన వారు ఉంటారు..చక..చకా..చేతులు కలుపుతూ..అన్ని రంగులను ఒకేదగ్గరకు తీసుకొస్తారు.

ఓ వ్యక్తి మాత్రం చూడకుండానే..రూబిక్ క్యూబ్ సాల్వ్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫిదా అయిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్, గ్రేట్ అంటూ కితాబిస్తున్నారు. ముంబైకి చెందిన అయిమన్ కోలి రూబిక్ క్యూబ్‌లను సాల్వ్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు. గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించాడు. ఇటీవలే..సచిన్ టెండూల్కర్ ను కలిశాడు. దీంతో అతడికి ఒక రూబిక్ క్యూబ్ ఇచ్చాడు. సాల్వ్ చేయాలని చెప్పాడు.

ఒకటికి రెండు సార్లు నిశితంగా గమనించాడు కోలి. తలపైన ఉంచి చూడకుండానే..కొన్ని సెకన్లలోనే సాల్వ్ చేశాడు. దీంతో సచిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సచిన్ పోస్టు చేసిన ఈ వీడియోకు బ్రెట్ లీ వంటి పలువురు మాజీ క్రికెటర్లు కూడా కామెంట్లు పెట్టారు. చూడకుండానే కొన్ని సెకన్లలోనే రూబిక్ క్యూబ్‌ను సాల్వ్ చేయడం..వావ్ అనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar)