భారత రోడ్లపై మైకేల్ వాన్ ట్విట్టర్ చురకలు

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ భారత రోడ్లపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

భారత రోడ్లపై మైకేల్ వాన్ ట్విట్టర్ చురకలు

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ భారత రోడ్లపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ భారత రోడ్లపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. రోడ్లపై ఇంకేమీ కనపడనట్లు తనకు కనిపించిన జంతువుల గురించే చెప్పుకొచ్చాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏం చెప్పాడంటే.. ‘భారత్‌లో ప్రయాణించడాన్ని ప్రేమిస్తున్నాను. ఈ ఉదయం చాలా బాగుంది. రోడ్డు మధ్యలో ఏనుగులు, ఆవులు, ఒంటెలు, గొర్రెలు, మేకలు, పందులే కనిపిస్తున్నాయి’ అని ట్వీట్ చేశాడు. 
Read Also : ఈసీ ని కలవనున్న వైసీపీ నేతలు : చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు

ఇక అంతే, ఆ ట్వీట్‍‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. ముందు వరల్డ్ కప్ టోర్నీ, యాషెస్ సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్ జట్టును సిద్ధం చేసుకొమ్మని చెబుతున్నారు.  ఇంకొకరేమో ఇంగ్లాండ్‌లో కేవలం పందులనే చూసి ఉంటాం. ఇక్కడ వేరే రకమైన పందులను చూసి పండగ చేస్కో’ అని ట్వీట్ చేస్తున్నారు.  

మైకేల్ వాన్ ఐపీఎల్‌పై విశ్లేషణాత్మకంగా చర్చిస్తాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా 6 సార్లు ఓడిపోవడంపై వాన్ స్పందించాడు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్‌కు ముందు కాస్తంత విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని విమర్శించాడు. 

 

Read Also : ముద్దంటూ కొరికేశాడు : 300ల కుట్లు..12 ఏళ్ల జైలు