Mike Tyson: ఫైట్ చేయడానికి ముందు మైక్ టైసన్‌కు సెక్స్ కంపల్సరీ – బాడీ గార్డ్

రెండు దశాబ్దాల పాటు బాక్సింగ్ ప్రపంచాన్ని ఏలిన అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్. అతని గురించి సుదీర్ఘ కాలం బాడీగార్డ్ గా పనిచేసిన రూడీ గోంజలేజ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

Mike Tyson: ఫైట్ చేయడానికి ముందు మైక్ టైసన్‌కు సెక్స్ కంపల్సరీ – బాడీ గార్డ్

Mike Tyson

Mike Tyson: రెండు దశాబ్దాల పాటు బాక్సింగ్ ప్రపంచాన్ని ఏలిన అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్. అతని గురించి సుదీర్ఘ కాలం బాడీగార్డ్ గా పనిచేసిన రూడీ గోంజలేజ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాక్సింగ్ ఫైట్ కు వెళ్లే ప్రతిసారి సెక్స్ ఉండాల్సిందేనట. దానర్థం మ్యాచ్ ముందు రోజని కాదట. డ్రెస్సింగ్ రూంలోనే అది జరిగిన కొద్ది క్షణాల తర్వాత గానీ బాక్సింగ్ ఫైట్ కు వెళ్లేవాడు కాదట.

‘మైక్ టైసన్ గ్రేటెస్ట్ సీక్రెట్స్ లో ఒకటి బాక్సింగ్ ఫైట్ కు వెళ్లే ముందు డ్రెస్సింగ్ రూంలో కచ్చితంగా సెక్స్ జరిపేవాడు. కచ్చితంగా అతని గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిన అవసర్లేదు. అదెవరైనా ఏమీ అభ్యంతరం చెప్పేవాడు కాదు. మొత్తానికి ఒక గ్రూపే సిద్ధంగా ఉండేది దాని కోసం. బాత్రూంలలో, ఛేంజింగ్ రూంలలో అతని కోసం ఎవరినోఒకరు రెడీగా ఉండేవార’ని చెప్పుకొచ్చాడు.

అలా చేయడం కూడా ప్రత్యర్థుల కోసమేనట. ‘ఒక్కోసారి ప్రత్యర్థులను ఒక్కనిమిషంలోనే చిత్తు చేసేసి.. వారి మెడ పట్టుకుని ఇవాళ బతికిపో అని చెప్పేవాడు. అలా సెక్స్ చేయకుండా వస్తే రింగ్ లో ప్రత్యర్థిని చంపేస్తానేమో అని భయపడేవాడు మైక్ టైసన్’ అని అంటున్నాడు బాడీగార్డ్.

…………………………………. హాట్ బ్యూటీ ‘రత్తాలు’ అందాల వల!

‘అతనితో ఫైట్ చేసిన చాలా మంది ఎముకలు విరిగి, రక్తం పారుతూ.. ఏడుస్తూ కూర్చొనేవారు. ఒక రైలు గుద్దినట్లు ఫైట్ కొనసాగించేవాడు. సెక్స్ జరిపి కాస్త పవర్ తగ్గించుకునేవాడు’ అలా వీలైనంత వరకూ ఫైట్ బ్యాలెన్స్ చేయగలిగేవాడని వివరించాడు.