Mithali Raj: క్లాసికల్ డ్యాన్సర్ నుంచి క్రికెటర్‌గా మిథాలీ రాజ్

టీమిండియా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు చెప్పేశారు. మిథాలీ రాజ్‌ది అస్సులు క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం. సైనిక కుటుంబం నుంచి వచ్చిన మిథాలీ ఎనిమిదేళ్ల వయసులో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది.

Mithali Raj: క్లాసికల్ డ్యాన్సర్ నుంచి క్రికెటర్‌గా మిథాలీ రాజ్

Mithali

Mithali Raj: టీమిండియా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు చెప్పేశారు. మిథాలీ రాజ్‌ది అస్సులు క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం. సైనిక కుటుంబం నుంచి వచ్చిన మిథాలీ ఎనిమిదేళ్ల వయసులో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది.

రెండేళ్ల తర్వాత ఆమె సోదరుడితో పాటు సరదాగా క్రికెట్ ఆడేది. అలా 10 సంవత్సరాల వయస్సులో తన చేతుల్లో బ్యాట్ తీసుకొని హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ స్కూల్‌లో క్రికెట్ కోచింగ్ తీసుకోవడం ప్రారంభించింది.

క్రికెట్‌ పట్ల ఇంటరెస్ట్ పెరిగి పురుషులతో జరిగే మ్యాచ్‌లలో ఆడేవారు మిథాలీ రాజ్. అలా క్రికెట్ లో మెలకువలు తెలుసుకుని ఇంటర్నేషనల్ క్రికెట్ వరకూ వెళ్లగలిగారు.

Read Also: కెప్టెన్సీలో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

ఐర్లాండ్‌తో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో అజేయంగా 114 పరుగులు చేశారు. అలా రేష్మా గాంధీతో కలిసి మొదటి వికెట్‌కు 258 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
2002లో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీ తన కెరీర్‌లో మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై మహిళల టెస్టు క్రికెట్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడి ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. 407 బంతుల్లో 214 పరుగులు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో కీరన్ రోల్టన్ 209 పరుగుల రికార్డు బ్రేక్ చేశారు.

వన్డేల్లోనే కాకుండా టెస్టుల్లోనూ అత్యధిక పరుగులు చేసిన మిథాలీ అగ్రశ్రేణి మహిళా క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతను పది టెస్టు మ్యాచ్‌ల్లో 51 సగటుతో 663 పరుగులు చేశాడు. T20లో కూడా మిథాలీ పేరిట అంతే బలమైన రికార్డు ఉంది.

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న మిథాలీ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. బుధవారం సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది. తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జీవితంలో రెండో ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది.