MIvsSRH: ముంబై ఉతికారేసింది

MIvsSRH: ముంబై ఉతికారేసింది

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ రేసుకు బెర్త్ కన్ఫామ్ చేసుకున్న మూడో జట్టుగా ముంబై నిలిచింది. చెన్నై, ఢిల్లీ తర్వాత ముంబై 16 పాయింట్లతో రేసులో ఉండగలిగింది. 

163 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా హైదరాబాద్ 162 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులో హార్దిక్ దూకుడుకు రషీద్ బౌలింగ్ సత్తా సరిపోలేదు. ముందుగా సూపర్ ఓవర్లో ముంబై ప్లేయర్ బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 2 వికెట్లు నష్టపోయి 7 పరుగులు చేసింది. ముంబైకు బౌలింగ్ చేసేందుకు రషీద్ ఖాన్ బాల్ అందుకోగా హార్దిక్ 7 పరుగులు, కీరన్ పొలార్డ్ 2పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. 

సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్లు దూరమవడంతో మ్యాచ్ గెలిచేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. మనీశ్ పాండే ఒంటరి పోరాటం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. మరో ఎండ్ లో బ్యాట్స్ మెన్ అవుట్ అవుతున్నా.. పట్టుదలతో క్రీజులో నిలబడి స్కోరు సంపాదించాడు. 47 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సులతో కలిపి 71 పరుగులు నమోదు చేశాడు. ఓపెనర్ల నుంచి హైదరాబాద్ జట్టులో తడబాటు కనిపించింది. 

సాహా(25), గఫ్తిల్(15), విలియమ్సన్(3), విజయ్ శంకర్(12), అభిషేక్ శర్మ(2). నబీ(31), రషీద్ ఖాన్(0)మాత్రమే చేయగలిగారు.