Congress: ఈ ఫొటోలో మోదీ వెనుక ఉన్నది ఎవరు? కాంగ్రెస్ ఏమంటోంది?

మోదీ అడ్డుగా నిలబడి కాపాడుతున్నట్లు కాంగ్రెస్ ఈ ఫొటోను రూపొందించింది.

Congress: ఈ ఫొటోలో మోదీ వెనుక ఉన్నది ఎవరు? కాంగ్రెస్ ఏమంటోంది?

Modi - Brij Bhushan Sharan Singh

Congress – Wrestlers Protest: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర ఫొటో పోస్ట్ చేసింది. బ్రిజ్ భూషణ్ సింగ్‌(Brij Bhushan Sharan Singh) ను ఎవరు కాపాడుతున్నారు? అని పేర్కొంది. ఈ ఫొటోలో ముందు మోదీ ఉంటారు. ఆయన వెనకాల బ్రిజ్ భూషణ్ సింగ్ నిలబడినట్లు ఉంది.

బ్రిజ్ భూషణ్ కు ఏమీ కాకుండా మోదీ అడ్డుగా నిలబడి కాపాడుతున్నట్లు కాంగ్రెస్ ఈ ఫొటోను రూపొందించింది. గతంలో మోదీ యోగా చేస్తుండగా తీసిన ఫొటోను ఇందుకు వాడుకుంది. బ్రిజ్ భూషణ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ అన్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా ఆయనపై విమర్శల జల్లు కురుస్తోంది.

అయినప్పటికీ ఆయనపై బీజేపీ చర్యలు తీసుకోవడం లేదు. ఆయనకు ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఉన్న పాప్యులారిటీనే అందుకు కారణమని, ఆయనపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా దెబ్బపడుతుందనే బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

బ్రిజ్ భూషణ్ 1991లో మొదటిసారి కైసరగంజ్ లోక్ సభ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ ఎంపీగా ఎన్నికయ్యారు. హిందుత్వ ఇమేజ్ కూడా బాగా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఆయన గెలుస్తారన్న అంచనాలు ఉన్నాయి.

Wrestlers Protest: తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు.. రెజ్ల‌ర్ల‌కు కపిల్ సేన విన్న‌పం