Mohammad Rizwan : పాకిస్తాన్ క్రికెటర్ వరల్డ్ రికార్డు.. ఆ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా ఘనత

పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కానిది అతడు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో..

Mohammad Rizwan : పాకిస్తాన్ క్రికెటర్ వరల్డ్ రికార్డు.. ఆ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా ఘనత

Mohammad Rizwan

Mohammad Rizwan : పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కానిది అతడు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో 2 వేల పరుగులు చేసి.. ఈ ఫీట్ సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ తో కరాచీలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో రిజ్వాన్ ఈ ఘనతను అందుకున్నాడు.

208 పరుగుల భారీ టార్గెట్ తో పాక్ బరిలోకి దిగింది. ఆది నుంచి దూకుడుగానే ఆడిన రిజ్వాన్.. ఇన్నింగ్స్ 11వ ఓవర్ లో ఫోర్ తో ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది 45 ఇన్నింగ్స్ లు ఆడిన రిజ్వాన్.. 55 యావరేజ్, 130 స్ట్రైక్ రేట్ తో 2వేల 036 పరుగులు సాధించాడు. అందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Lose Weight : బరువు తగ్గాలంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి ఇవి తీసుకోండి

ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బాబర్ ఆజమ్ పేరు మీదున్న (1,779) రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. మూడో స్థానంలో విండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఉన్నాడు. 2015లో అతడు 1,665 పరుగులు చేశాడు. 2016లో 1,614 పరుగులు చేసిన కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.

Vegetables : మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో ఉన్నాయా?

విండీస్ తో మ్యాచ్ లో పాక్ క్రికెటర్లు మరో రికార్డు కూడా నెలకొల్పారు. లక్ష్య ఛేదనలో బాబర్ ఆజమ్, రిజ్వాన్ ఆరోసారి శతక భాగస్వామ్యం నమోదు చేశారు. తద్వారా రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ పేరు మీదున్న రికార్డును బ్రేక్ చేశారు. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఐదుసార్లు ఈ ఫీట్ ను సాధించింది. వెస్టిండీస్ తో కరాచీ వేదికగా మూడో టీ20 జరిగింది. విండీస్ తో పోరులో 18.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది పాక్.